Adipurush: గొప్ప మనసు చాటుకున్న మనోజ్ మౌనిక దంపతులు.. ప్రశంసిస్తున్న అభిమానులు!

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచు మనోజ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు. వివాహం చేసుకున్న తర్వాత తన వృత్తిపరమైన జీవితంతో పాటు వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక మనోజ్ ఎప్పటికప్పుడు సామాజిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటూ తన మంచి మనసును చాటుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజుల క్రితం మనోజ్ పుట్టినరోజు రావడంతో ఈయన అనాధ ఆశ్రమంలో పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.

అక్కడ ఉన్నటువంటి చిన్నారుల సమక్షంలో కేక్ కట్ చేయడమే కాకుండా వారికి కావాల్సిన వస్తువులు అన్నింటిని కూడా అందించారు. అయితే తాజాగా మరోసారి మనోజ్ తన మంచి మనసు చాటుకున్నారు. ప్రభాస్ హీరోగా నటించిన ఆది పురుష సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ సినిమా రామాయణం ఇతిహాసం నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు రావడంతో ఇలాంటి ఒక గొప్ప సినిమాను ప్రతి ఒక్కరు చూడాలని పలువురు హీరోలు ఏకంగా వేల సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే మనోజ్ మౌనిక దంపతులు సైతం అనాధ పిల్లల కోసం 2500 టికెట్లను కొనుగోలు చేశామంటూ ఈ విషయాన్ని మనోజ్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. అయితే ఆది పురుష సినిమా జూన్ 16వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ క్రమంలోనే మనోజ్ మౌనిక దంపతులు అనాధ చిన్నారులతో కలిసి థియేటర్లో (Adipurush) ఆది పురుష్ సినిమాని వీక్షించారు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మంచు మనోజ్ మౌనిక దంపతులు నిజంగా గ్రేట్ అంటూ ప్రభాస్ అభిమానులు వీరి పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక మనోజ్ సైతం ప్రస్తుతం పలు సినిమా షూటింగులతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన వాట్ ది ఫిష్ అనే సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus