మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డి ల వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. వీళ్ళ వివాహం గురించి చాలా వార్తలు హల్ చల్ చేశాయి. మౌనికతో వివాహానికి మనోజ్ కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదని.. మరీ ముఖ్యంగా మంచు విష్ణుకి- మనోజ్ కు మధ్య విభేదాలు వచ్చాయని ప్రచారం జరిగింది. అయితే ఫైనల్ గా మనోజ్ – మౌనిక ల వివాహాన్ని దగ్గరుండి అంగరంగ వైభవంగా జరిపించింది మనోజ్ సోదరి మంచు లక్ష్మీ. ఇక వీరి పెళ్లి రీత్యా ఓ యుద్ధమే జరిగినట్టు అంతా చెప్పుకొచ్చారు.
మనోజ్ (Manoj) కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ‘ఈశ్వర’ అనే పాట సినిమాలో 5 నిమిషాలు ఉంటే మా జీవితంలో మాత్రం 2 ఏళ్ళు ఉంది అంటూ మనోజ్ చెప్పడంతో.. మౌనికతో అతని పెళ్లి వెనుక ఎంత గాధ ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. పెళ్లి తర్వాత మనోజ్ – మౌనిక లు హ్యాపీగా ఆళ్ళగడ్డ టు హైదరాబాద్ కు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. వారి బ్యూటిఫుల్ మూమెంట్స్ కు సంబంధించిన ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :