Manchu Manoj: పెళ్లి రోజున మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. వాళ్ల లోటును భర్తీ చేయలేనంటూ?

Ad not loaded.

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోలలో మంచు మనోజ్ ఒకరు కాగా మనోజ్ రియాలిటీ షోలకు హోస్ట్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉండటంతో పాటు వాట్ ది ఫిష్ అనే సినిమాలో నటిస్తున్నారు. పెళ్లిరోజు సందర్భంగా మనోజ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టగా ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుండటం గమనార్హం. మనోజ్ తన ట్వీట్ లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా ప్రియమైన భార్య భూమా మౌనికకు మొదటి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు అని ఆయన తెలిపారు.

ప్రతిరోజూ లవ్, హ్యాపీనెస్ తో కూడిన అద్భుతమైన ప్రయాణమిది అని మనోజ్ చెప్పుకొచ్చారు. ధైరవ్, మనకు పుట్టబోయే బిడ్డ కోసం దేవునికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని మనోజ్ వెల్లడించారు. మీ ఉనికి నా జీవితాన్ని ప్రేమ, సాంగత్యంతో అసాధారణంగా మార్చేసిందని మనోజ్ కామెంట్లు చేశారు. మీ తల్లీదండ్రుల లోటును ఎన్నటికీ భర్తీ చేయలేనని అయితే వారి జీవితంలో అత్యంత విలువైన వారిని సంరక్షిస్తానని వాగ్దానం చేస్తున్నానని మనోజ్ పేర్కొన్నారు.

మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మిమ్మల్ని కాపాడతానని మాటిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఇక్కడ మాకు, మా ఫ్యామిలీకి అనేక మధుర జ్ఞాపకాలు ఉన్నాయని మనోజ్ కామెంట్లు చేయడం గమనార్హం. ఈ సందర్భంగా నా భార్యామణికి పెళ్లి రోజు శుభాకాంక్షలని ఆయన అన్నారు. మీరు నా హృదయం, ఆత్మలో అత్యంత విలువైన భాగం అని ఇప్పటికీ ఎప్పటికీ నిన్ను ప్రేమించే మను అంటూ మనోజ్ తన పోస్ట్ ను ముగించారు.

మనోజ్ (Manchu Manoj) చేసిన పోస్ట్ కు 3000కు పైగా లైక్స్ వచ్చాయి. మనోజ్ చేసిన పోస్ట్ గురించి భూమా మౌనిక స్పందిస్తూ ప్రేమపై మళ్లీ నమ్మకం వచ్చిందని నాకు, ధైరవ్ కు చోటిచ్చినందుకు థ్యాంక్స్ హజ్బెండ్ అంటూ కామెంట్లు చేశారు.

https://twitter.com/HeroManoj1/status/1764285572930048062

‘సలార్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందంటే?!

నయన్ విఘ్నేష్ మధ్య విబేధాలకు అదే కారణమా.. అసలేమైందంటే?
నిశ్చితార్థం చేసుకున్న వరలక్ష్మి శరత్ కుమార్.. వరుడి బ్యాగ్రౌండ్ ఇదే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus