Manchu Manoj: నీ ప్రేమ నా జీవితాన్ని అందంగా మార్చేసింది.. మనోజ్ పోస్ట్ వైరల్!

  • August 2, 2023 / 10:10 PM IST

మంచు మనోజ్ ప్రస్తుతం భూమా మౌనిక రెడ్డిని రెండవ వివాహం చేసుకుని తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇలా మౌనిక రెడ్డికి కూడా ఇది రెండవ వివాహం కావడం గమనార్హం.ఇలా వీరిద్దరూ ఈ ఏడాది మార్చి నెలలో వివాహం చేసుకొని కొత్త జీవితం ప్రారంభించారు. అయితే మౌనిక తన జీవితంలోకి వచ్చిన తర్వాత తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నాను అంటూ పలు సందర్భాలలో మనోజ్ మౌనికపై ఉన్నటువంటి ప్రేమను తెలియజేశారు.

ఇకపోతే మౌనిక తన మొదటి భర్తకు కలిగినటువంటి సంతానంగా ఒక అబ్బాయి ఉన్న విషయం మనకు తెలిసిందే ఈ అబ్బాయి పేరు ధైరవ్ నాగిరెడ్డి. మౌనిక విడాకులు తీసుకొని విడిపోవడంతో చిన్నారి మౌనిక వద్దే ఉంటున్నారు అయితే మౌనిక మనోజ్ వివాహం జరిగిన తర్వాత మనోజ్ ధైరవ్ ను తన కొడుకుగా అంగీకరించారు. ఇది శివుడు నాకు ఇచ్చిన గొప్ప బహుమానం అంటూ ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.

ఇకపోతే మనోజ్ (Manchu Manoj) ఆ చిన్నారి పట్ల ఎంతో ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు. ఇకపోతే తాజాగా ధైరవ్ఐదవ పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి ఈ క్రమంలోనే తన కుమారుడి పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ ఎమోషనల్ అవుతూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ సందర్భంగా మనోజ్ ధైరవ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ…

ఈ అపూర్వమైన రోజున లార్డ్ శివ ధైరవ్ నాగిరెడ్డి రూపంలో వెలకట్టలేనటువంటి నిధిని ఇచ్చారు. ధైరవ్ రాకా ఒక సంఘటన కాదు ఇది ఒక కొత్త ప్రయాణానికి నాంది. ఈ ప్రయాణంలో ప్రతిరోజు నేను ఆస్వాదిస్తున్నాను. నీ నవ్వు అమాయకత్వం ప్రేమ నన్ను నడిపించే కాంతులు నువ్వు, అమ్మ మౌనిక ప్రేమ నా జీవితాన్ని అందంగా మార్చేసాయి అంటూ ధైరవ్ నాగిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ సుదీర్ఘమైనటువంటి పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus