Manchu Manoj: ఒక్క మాటతో మనోజ్ క్లారిటీ ఇచ్చేశాడు.. అవి నిజమే అన్నమాట..!

  • September 5, 2022 / 12:47 PM IST

మంచు మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్ విభిన్న కథా చిత్రాలతో ప్రేక్షకులను అలరించాడు.మంచు ఫ్యామిలీ అంతా ట్రోలింగ్ స్టఫ్ గా మారితే మనోజ్ పై మాత్రం జనాల్లో పాజిటివ్ కార్నర్ ఉంది. అయితే కొంత కాలంగా మనోజ్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అందుకు కారణాలు తెలిసినవే..! 2015లో ప్రణతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు మనోజ్. కానీ అనూహ్యంగా వీరు విడిపోయారు. పర్సనల్ లైఫ్ డిస్టర్బ్ అవ్వడంతో మనోజ్ డిప్రెషన్లోకి వెళ్లిపోవడం, సినిమాలకు దూరమవ్వడం జరిగింది.

లాక్ డౌన్ కు ముందు ‘అహం బ్రహ్మాస్మి’ అనే చిత్రాన్ని కూడా మొదలుపెట్టాడు మనోజ్. కానీ కొన్ని కారణాల వల్ల ఆ మూవీ ఆగిపోయింది. ఇదిలా ఉండగా.. మనోజ్ రెండో పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ ఓ వార్త ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. ఇలాంటి వార్తలు గతంలో కూడా చాలా వచ్చాయి. కానీ మనోజ్ అవి గాలి వార్తలు అని కొట్టిపారేశాడు.అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దివంగత నేత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ల..

రెండవ కుమార్తె మౌనిక రెడ్డిని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా వినాయక మండ‌పం వ‌ద్ద మౌనికారెడ్డితో క‌లిసి పూజ‌లు చేశాడు మ‌నోజ్‌. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అనంతరం మీడియాతో ముచ్చటించిన మనోజ్ కు ‘మౌనిక గారిని రెండో పెళ్లి చేసుకోబోతున్నారా?’ అనే ప్రశ్న ఎదురైంది. అందుకు మనోజ్..’ అది మంచి రోజు చూసి చెప్తాను’ అంటూ బదులిచ్చాడు.

అంటే పరోక్షంగా మనోజ్ క్లారిటీ ఇచ్చినట్టే అని అంతా భావిస్తున్నారు.అలాగే తన పొలిటికల్ ఎంట్రీ పై కూడా త్వరలో స్పందిస్తాను అని మనోజ్ తెలిపాడు.’అహం బ్రహ్మాస్మి’ మూవీ ఆగిపోవడం పై కూడా అతను స్పందించాడు. తాను చేయబోయే సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా త్వరలో వెల్లడిస్తాను అని మనోజ్ తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

రంగ రంగ వైభవంగా సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘రంగ రంగ వైభవంగా’ కి డిజాస్టర్ టాక్ రావడానికి గల 10 కారణాలు..!
పవన్ కళ్యాణ్ తో నటించిన ఈ 11 మంది హీరోయిన్లకు కలిసి రాలేదట..!
8నెలల వయసులోనే సినిమాల్లోకి ఎంట్రీ.. అక్కినేని నాగార్జున గురించి 10 ఆసక్తికర

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus