హీరోగా కంటే నటుడిగా, వ్యక్తిగా మంచి పేరు సంపాదించుకొన్న మంచు మనోజ్ కు “ఒక్కడు మిగిలాడు” తర్వాత ఇప్పటివరకూ మరో సినిమా ఆఫర్ రాలేదు. ఈ విషయమై మనోజ్ ను అడిగినా.. “కొన్నాళ్లపాటు వదిలేయండి” అంటూ సింపుల్ గా తప్పించుకొంటున్నాడు. అయితే.. మనోజ్ ఇప్పుడు సినిమాల నుంచి పాలిటిక్స్ వైపు మరలుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఏ పార్టీలో జాయిన్ అవుతున్నాడు అనే విషయంలో ఇంకా క్లారిటీ లేకపోయినప్పటికీ.. జూబ్లీ హిల్స్ పరిధి నుంచి మంచు మనోజ్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది అని ఇవాళ ఓ ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ఓ వార్త ప్రచురించడంతో ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశం అయ్యింది.
మరి ఈ విషయం ఎంత నిజం, ఎంత అబద్ధం, ఎంతవరకూ ఊహాతీతం అనేది తెలియదు కానీ.. ఒకవేళ మనోజ్ గనుక నిజంగా పాలిటిక్స్ లోకి వెళితే గనుక ఇక సినిమాలకి గుడ్ బై చేప్పేసినట్లేనా అని డౌట్ నెలకొని ఉంది. ముఖ్యంగా మనోజ్ కి ఇప్పుడు సినిమాల్లో పెద్దగా క్రేజ్ కానీ బిజినెస్ కానీ లేకపోవడంతో మనోజ్ తన దృష్టి మొత్తాన్ని పాలిటిక్స్ వైపు కూడా కేంద్రీకరించే అవకాశం చాలా ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.