Manchu Vishnu: ఈ వారం అలీ ఇంటర్వ్యూ హీట్ రేపేలా ఉందే!
- August 18, 2021 / 09:16 AM ISTByFilmy Focus
అలీతో సరదాగా అనీ… ప్రముఖ నటుడు అలీ ఈటీవీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటారు. వారం వారం వైవిధ్యమైన గెస్ట్‌లను తీసుకొస్తుంటారు. ప్రతిసారి వచ్చే గెస్ట్‌లు తమ కెరీర్ తొలి రోజులు, మలుపు తిరిగిన రోజులు, కష్టపడ్డ రోజుల గురించి చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో కాంట్రవర్శీలు చాలా బయటకు వస్తుంటాయి. అలాగే వచ్చే వారం ‘ఆలీతో సరదాగా’ డబుల్ కాంట్రవర్శీగా ఉండబోతోందా? ఏమో ప్రోమో చూస్తే అలానే అనిపిస్తోంది. వచ్చే వారం రాబోయేది మంచు విష్ణు.
మంచు వారబ్బాయి మామూలు రోజుల్లో ‘ఆలీతో సరదాగా’కి వచ్చి ఉంటే ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. అయితే త్వరలో ‘మా’ ఎన్నికల నిర్వహణ జరగనున్న నేపథ్యంలో విష్ణు ఏం మాట్లాడతాడు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ షో ప్రోమోలో కూడా ఎన్నికలకు సంబంధించి ఒకటి రెండు ప్రశ్నలు వినిపించాయి. మరి అసలు ఎపిసోడ్‌లో ఏముంటాయి అనేది చూడాలి. వాటికి మంచు విష్ణు ఏం చేప్పాడు అనేది కూడా ఆసక్తికరమే. ఇదే ప్రోమోలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి.

అందులో ఒకటి మంచు సోదరుల మధ్య సరైన సయోధ్య లేదు అంటూ బయట వస్తున్న చర్చను వ్యాఖ్యాత అలీ… మంచు విష్ణు ముందుంచాడు. దానికి విష్ణు స్పందన కాస్త కోపంగా కనిపించింది. అయితే ఇది ప్రోమో కట్ ఆ.. లేక నిజంగా విష్ణు కోపంగా సమాధానం చెప్పారా అనేది చూడాలి. ఏదైనా ఇదంతా చూస్తుంటే ఈ ఎపిసోడ్ టాలీవుడ్‌లో వేడి పుట్టిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు.
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!












