Manchu Vishnu, Allu Arjun: బన్నీని చూసి అసూయా పడుతున్నాను!

మొత్తానికి టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై విజయం సాధించి కొత్త అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఎన్నికల అనంతరం కూడా ఎప్పటిలానే గొడవలు జరుగుతూనే ఉన్నాయి. విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. ఇక మంచు విష్ణు మాత్రం మాత్రం ఎన్నో కీలక మార్పులు తేవాల్సి ఉందని వరుసగా ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇక ఇండస్ట్రీలో ఎవరితోనూ తనకు శత్రుత్వం లేదని అందరు కూడా తనతో చాలా సఖ్యత గా ఉంటారు అని తెలియజేశాడు.

తనకు అల్లు అర్జున్ మంచి స్నేహితులు అని అతనితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉందని కూడా తెలియజేశాడు. అయితే ఒక విషయంలో ఇటీవల బన్నీని చూసి కొంత అసూయ కూడా కలిగిందని అలాగే అతని పనితీరు పై గౌరవం కూడా పెరిగిందని అందుకు గర్వపడుతున్నానని కూడా చెప్పాడు. బన్నీ నేను ఎక్కువగా ఫోన్ లో మెసేజ్ లో చేసుకుంటాము అంటూ.. బన్నీ పై అసూయ ఎందుకంటే అతను బాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ అగ్రహీరో అయినటువంటి అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాతోనే పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాడు.

ఆ సినిమాతో పాటు పుష్ప సినిమా కూడా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఒక విధంగా ఆ విషయంలో తెలుగు నటుడిగా తెలుగువాడిగా బన్నీని చూసి గర్వ పడుతున్నానని కూడా విష్ణు తనదైన శైలిలో వివరణ ఇచ్చాడు.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus