నిన్న జరిగిన ‘మా'(మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ పై మంచు విష్ణు ప్యానల్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం ప్రకాష్ రాజ్, నాగ బాబు వంటి వారు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.ఈ విషయాల పై జూబ్లిహిల్స్ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంచు విష్ణు మాట్లాడారు. ఈ సందర్భంగా నాగబాబు, ప్రకాష్ రాజ్‌ల రాజీనామాను ఆమోదించడం లేదు అని స్పష్టం చేశారు విష్ణు.
మరోపక్క చిరంజీవి, చరణ్ లు వంటివారి పై అతను చురకలు అంటించడం అందరినీ షాక్ కు గురిచేసిందనే చెప్పాలి. విష్ణు మాట్లాడుతూ… “నన్ను మా ఎన్నికల పోటీకి సంబంధించి నామినేషన్ విత్ డ్రా చేసుకోమని చెప్పిందే చిరంజీవి గారు. ఆయనే నాకు ఆ విధంగా సూచించారు.చరణ్ నాకు ఓటేసాడని చెప్పాడు. అది అబద్దమే… అతనికి చిరంజీవి గారు ప్రకాష్ రాజ్ కే ఓటేయమని చెప్పుంటారు. అతనికే ఓటేసి ఉంటాడు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు విష్ణు.
నిన్న పోలింగ్ బూత్ వద్ద విష్ణు- చరణ్ లు ఎంతో సన్నిహితంగా హగ్ చేసుకుని, నవ్వుకుంటూ కనిపించిన సంగతి తెలిసిందే.ఇంతలో విష్ణు ఇలా కామెంట్లు చేయడం.. మరోపక్క మోహన్ బాబు కూడా ‘ఎవరో సినిమా వేడుకలో ఏదో మాట్లాడితే దానిని సీరియస్ గా తీసుకోవాల్సిన పని లేదు’ అంటూ పరోక్షంగా పవన్ పై సెటైర్లు వేయడం కూడా చర్చనీయాంశం అయ్యింది.
Most Recommended Video
సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు