కరోనా ఎఫెక్ట్.. ‘మోసగాళ్లు’కు 3.5 కోట్ల నష్టం..!

  • March 30, 2020 / 01:28 PM IST

ప్రపంచం వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అనేక విధాలుగా దర్శక నిర్మాతలు నష్టపోతున్నారు. కాగా మరో తెలుగు మూవీకి కరోనా సెగ తగిలింది. మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న చిత్రం మోసగాళ్లు. హాలీవుడ్ అండ్ ఇండియన్ వెంచర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ ఐటీ స్కామ్ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుంది. 2019 లో ఈ చిత్ర షూటింగ్ మొదలుకాగా ఇప్పటికే చాలా భాగం పూర్తయినట్లు సమాచారం. కాగా హైదరాబాద్ శివారులో దాదాపు 3.5 కోట్లకు పైగా బడ్జెట్ తో ఓ భారీ ఐటీ కంపెనీ ఆఫీస్ సెట్ వేశారు.

ఈ భారీ సెట్ నందు కొన్ని కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగాల్సివుంది. ఐతే కరోనా వ్యాప్తి ప్రమాదకర స్థాయిలో కొనసాగుతున్న నేపథ్యంలో షూటింగ్ నిలిపివేశారు. దీనితో నిర్మాత మంచు మనోజ్ కి 3.5 కోట్ల భారీ నష్టం వాటిల్లినట్టు తెలుస్తుంది. సినిమా కథ రీత్యా ఓ భారీ ఐటీ ఆఫీస్ సెట్ లో అధిక భాగం షూటింగ్ జరగాల్సివుంది. దీని కోసం భారీ వ్యయంతో ఆఫీస్ సెట్ ఏర్పాటు చేయగా షూటింగ్ నిలిపివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

చిత్రం కోసం పనిచేస్తున్న సాంకేతిక నిపుణులు మరియు నటుల ఆరోగ్య భద్రత రీత్యా ఈ ఖరీదైన ఆఫీస్ సెట్ లో చిత్రీకరణ నిలిపివేయడం జరిగింది. హాలీవుడ్ డైరెక్టర్ జెఫరీ చిన్ ఈ మూవీకి దర్శకత్వం వహిస్తుండగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఓ కీలక రోల్ చేస్తున్నారు. విష్ణు ఈ చిత్రంలో మేధావి అయిన ఐటీ క్రిమినల్ గా కనిపిస్తాడని సమాచారం.

Most Recommended Video

ఈ 17 ఏళ్లలో బన్నీ వదులుకున్న సినిమాలు ఇవే!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు!
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus