Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » కథపై న‌మ్మ‌కంతోనే `మోసగాళ్లు` చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్లో చేశాం – విష్ణు మంచు

కథపై న‌మ్మ‌కంతోనే `మోసగాళ్లు` చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్లో చేశాం – విష్ణు మంచు

  • March 17, 2021 / 09:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కథపై న‌మ్మ‌కంతోనే `మోసగాళ్లు` చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్లో చేశాం –  విష్ణు మంచు

విష్ణు మంచు హీరోగా 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మిస్తోన్న పాన్‌ ఇండియా మూవీ ‘మోసగాళ్లు’. జెఫ్రీ గీ చిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 19న సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో మంచు విష్ణు ఇంటర్వ్యూ…

*సాధారణంగా సినిమా రిలీజ్‌ అయ్యే సమయంలో ఏ హీరో అయినా టెన్షన్‌ పడతాడు. టెన్షన్‌ లేదంటే మీరు నమ్మకండి. ప్రతి ఒక్కరికీ యాంగ్జయిటీ ఉంటుంది. నాకున్న మార్కెట్‌ వేల్యూ కన్నా ఎక్కువగా ఖర్చుపెట్టాను.

* కథపై నమ్మకంతో ఎలాంటి పేరా మీటర్స్‌ ఆలోచించకుండా ఖర్చు పెట్టి చేసిన సినిమా. నేను అమెరికా, లాస్‌ ఏంజిల్స్‌ వెళ్లినప్పుడు ఈ సినిమాలో అనుకున్న విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అలాగే ముంబై మీడియాలోనూ దీని గురించి ఎక్కువగా రాశారు. అమెరికా ఉన్నప్పుడు ఈ స్కామ్‌కు సంబంధించిన ఫోన్‌ కాల్‌ కూడా నాకు వచ్చింది. నేను మాట్లాడాను. ప్రకృతి ఈ పాయింట్‌తో సినిమా చేయమని చెబుతుందని నాకు అనిపించింది. అలా సినిమా స్టార్ట్‌ అయ్యింది.

*హైదరాబాద్‌లోని ఓ బస్తీలో ఉండే అక్క, తమ్ముడు అమెరికాకు వెళ్లి అక్కడ వేల మంది కుటుంబాలను రోడ్డున పడేలా చేశారు. తెల్లవాళ్లు కదా, వాళ్ల దగ్గర డబ్బులుంటాయని వాళ్లు అనుకుని, తెలివి తేటలతో మోసం చేసి డబ్బు సంపాదించి అటు అమెరికన్‌ ప్రభుత్వానికి , ఇటు ఇండియన్‌ ప్రభుత్వానికి దొరక్కుండా ఎలా తప్పించుకున్నారనేదే సినిమా.

* సినిమా కథ అనుకున్నప్పుడు ఆ అక్కా త‌మ్ముళ్ల‌ను క‌లుసుకోలేదు కానీ మిగతా వారిని కలుసుకున్నాను. ముందు డ్రాఫ్ట్‌ తయారు చేసుకున్నప్పుడు కథలోని గ్యాప్‌ను బట్టి చాలా లిబర్టీ తీసుకున్నాను. అలాగే డైరెక్టర్‌ జెఫ్రీ గీ చిన్‌ వచ్చిన తర్వాత మరో డ్రాఫ్ట్‌ రెడీ అయ్యింది. మన నెటివిటీకి తగ్గట్టు మార్పులు చేర్పులు చేయడానికి డైమండ్‌ రత్నబాబుగారి హెల్ప్‌ తీసుకున్నాను. తొంబై శాతం నిజమైన కథ, పది శాతం లిబర్టీస్‌ తీసుకుని తయారు చేశాం.

* ఈ స్కామ్‌లో మెయిన్‌ వ్యక్తులు మన దేశానికి చెందినవారు. ఆయన పేరు చెప్పలేను కానీ.. మన భారతదేశం పరువు పోకూడదని మన దేశం తరపున సిన్సియర్‌గా డ్యూటీ చేసిన పోలీస్‌ ఆఫీసర్‌ను ఈ సినిమా మేకింగ్‌ సందర్భంలో కలిశాను. ఓ టఫ్‌ పోలీస్‌ ఆఫీసర్‌ రోల్‌ కాబట్టి ఎవరిని తీసుకోవాలని అనుకున్నప్పుడు సునీల్‌ శెట్టిగారు ఆలోచనలోకి వచ్చారు. పాన్‌ ఇండియా సినిమా కాబట్టి అందరికీ ఆయన కనెక్ట్‌ అవుతారనినిపించింది. సాధారణంగా మనం ఇక్కడ ఎవరి జీవిత చరిత్రనైనా సినిమాగా చేసేయవచ్చు. మనకు ఎదురయ్యే సమస్యలు తక్కువగానే ఉంటాయేమో. కానీ ఈ సినిమా చేసే సమయంలో నాకు చాలా కొత్త విషయాలు తెలిసింది. ఓ ఆర్టికల్‌ను బేస్‌ చేసుకుని సినిమా తీయాలన్నా రైట్స్‌ తీసుకోవాలి. అలాగే స్కామ్‌లో మెయిన్‌గా ఉన్న అక్క, తమ్ముడు నాపై కేసు వేస్తే ఫేస్‌ చేయడానికి నేను సిద్ధంగా ఉండాలి. సినిమా కోసం ఇన్సురెన్స్‌ తీసుకోవాలి. ఈ సినిమా ఇన్సురెన్స్‌కే నా బడ్జెట్‌లో ఇరవై శాతం ఖర్చయ్యింది. హాలీవుడ్‌లో సినిమా చేసే ముందు జరిగే ప్రీ ప్రొడక్షన్‌ చాలా ఫోకస్‌గా ఉంటుంది.

* ఎక్కువ బడ్జెట్‌ పెట్టిన మూవీ. యూనివర్సల్‌ కథాంశం. ఇతర భాషల్లో విడుదల చేసుకోవడానికి స్కోప్‌ ఉందనిపించి పాన్‌ ఇండియా మూవీ మోసగాళ్లు సినిమా చేశాను. ఇండియన్‌ వెర్షన్‌ షూటింగ్‌ పూర్తయ్యింది. ఇక ఇంగ్లీష్‌ వెర్షన్‌ షూటింగ్‌ వారం, పది రోజులు పెండింగ్‌ ఉంది. కరోనా కారణంగా చేయలేకపోయాం. అక్కడి ఆర్టిస్టులు మే నెలలో డేట్స్‌ కేటాయించారు.

* ఓ స్టార్‌ హీరోయిన్‌, అందరికీ తెలిసిన హీరోయిన్‌ను నా అక్క పాత్రలో నటింప చేయాలని అనుకున్నప్పుడు ముందు ప్రీతి జింతా గారిని కలిశాను. ఆవిడ కాస్త భయపడింది. తర్వాత ఇప్పుడున్న హీరోయిన్స్‌లో ఎవరు టాప్‌గా ఉంటారో ఆమెను అడుగుదాం అని అనుకున్నాను. అప్పుడు కాజల్‌ అగర్వాల్‌ ఐడియాకు రాగానే, ఆమెను అడిగాను. కాజల్‌ చాలా స్పోర్టివ్‌గా తీసుకుని సినిమాలో నటించడానికి ఒప్పుకుంది.

* ప్రొడ్యూసర్‌గా మూడు సిరీస్‌లు చేయబోతున్నాను. వాటి వివరాలను ఏప్రిల్‌లో అనౌన్స్‌ చేస్తాను. ఢీ అండ్‌ ఢీ ఇప్పటికే స్టార్ట్‌ కావాలి. కానీ..శ్రీనువైట్లగారు ఇంకా కథపైనే కూర్చుని ఉన్నారు. ఎలాగైనా గట్టిగా కొట్టాలని ఆయన బలంగా అనుకుంటున్నారు. ఏప్రిల్‌ ద్వితీయార్థంలో సినిమా ప్రారంభం కావచ్చు. ఢీకి ఇది సీక్వెల్‌ కాదు. మరికొన్ని చిత్రాలు డిస్కషన్‌ స్టేజ్‌లోనే ఉన్నాయంటూ ఇంటర్వ్యూ ముగించారు విష్ణు మంచు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #24 Frames Factory
  • #KajalAggarwal
  • #Mosagallu
  • #Navdeep
  • #Naveen Chandra

Also Read

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

Spirit: నా పాత్ర షూటింగ్ ఇంకా మొదలు కాలేదు అప్పుడే తీసేశారా.. ప్రకాష్ రాజ్ క్లారిటీ

related news

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్

నవీన్ చంద్ర, కరుణ కుమార్, OVA ఎంటర్‌టైన్‌మెంట్స్, సైకలాజికల్ హారర్ మూవీ ‘హనీ’ టెర్రిఫిక్ టీజర్ రిలీజ్

trending news

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

Mana ShankaraVaraprasad Garu Collections: ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చినా వసూళ్ళు తగ్గడం లేదుగా

7 mins ago
Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

Manchu Vishnu: మంచు విష్ణు- ప్రభుదేవా.. ఎక్కడ వరకు వచ్చింది?

25 mins ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

Pawan Kalyan: పవన్ కళ్యాణ్- సురేందర్ రెడ్డి @250 కోట్లు

47 mins ago
Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

Tammareddy Bharadwaja: ఇండస్ట్రీ పెద్ద చిరంజీవి కాదా.. తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు

18 hours ago
2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

2027 Sankranthi: 2027 సంక్రాంతి.. మొత్తం సీనియర్లదే..!

20 hours ago

latest news

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

Vijay-Rashmika : మార్చి 4న విజయ్-రష్మిక రిసెప్షన్..?

1 hour ago
Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

Aishwarya Rajesh : సెట్ లో చెఫ్ గా మారిపోయిన ఐశ్వర్య రాజేష్ !

20 hours ago
Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

Surekha Vani: మా అమ్మకు మళ్ళీ పెళ్లి చేస్తా : సుప్రీత

21 hours ago
Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

Varanasi: ‘వారణాసి’ బిజినెస్ లెక్కలకు డిస్ట్రిబ్యూటర్లు ఫ్లాట్

22 hours ago
Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

Prabhas: స్పిరిట్.. ప్రభాస్ అలెర్ట్ అవ్వాల్సిందే..

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version