మంచు విష్ణు భార్య విరానికా బర్త్ డే స్పెషల్ పిక్స్ వైరల్..!

టాలీవుడ్ హీరో, మా అధ్యక్షుడు అయిన మంచు విష్ణు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటాడో అందరికీ తెలిసిన సంగతే. తన భార్య, పిల్లలకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ.. మంచు అభిమానులకు ఫీస్ట్ ఇస్తూ ఉంటాడు. ఫ్యామిలీ ఫోటోల విషయాల్లో కాకుండా మంచు విష్ణు షేర్ చేసే కొన్ని పోస్ట్ ల పై ట్రోలింగ్ కూడా జరుగుతుంటుంది. వాటిని మంచు విష్ణు పెద్దగా కేర్ చేయడు.

తన పై ట్రోల్ చేసిన వారి పై మండిపడటం కూడా మంచు విష్ణు చేయడు. ఇదిలా ఉండగా.. మంచు విష్ణుతో పాటు తన భార్య విరానికా కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. మంచు విష్ణుకి నలుగురు పిల్లలు అన్న సంగతి తెలిసిందే. అరియానా, వివియానా కవలలు కాగా కొడుకు అవ్రమ్. నాలుగో సంతానంగా ఐరా విద్య జన్మించింది. ఇదిలా ఉండగా.. నిన్న విరానికా పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు కొన్ని ఫోటోలను షేర్ చేసాడు.

ఈ ఫొటోల్లో విరానికా – విష్ణు వైట్ ఔట్ఫిట్స్ లో చూడముచ్చటగా ఉన్నారు. అంతేకాదు ఈ ఫొటోల్లో విరోనికా ధరించిన ఔట్ఫిట్ స్వయంగా ఆమెనే డిజైన్ చేసుకుంది. ఈమె నిన్న విరానికా బ్రాండ్ అనే క్లోతింగ్ బోటిగ్ ను కూడా లాంచ్ చేసారు. ఈ రకంగా ఆమె బిజినెస్ రంగంలో కూడా సత్తా చాటాలని భావిస్తుంది. ఇక ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus