Mangalavaaram Collections: ‘మంగళవారం’ 10 రోజుల కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?

  • November 27, 2023 / 07:11 PM IST

‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కాంబినేషన్లో రూపొందిన మరో క్రేజీ మూవీ ‘మంగళవారం’. ‘ముద్ర మీడియా వర్క్స్’ బ్యానర్ పై స్వాతి రెడ్డి గునుపాటి, ఎం సురేష్ వర్మతో కలిసి అజయ్ భూపతి ‘A’ క్రియేటివ్ వర్క్స్ సంస్థ పై ఈ చిత్రాన్ని దాదాపు రూ.20 కోట్ల బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నవంబర్ 17 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మొదటి షోతోనే ఈ మూవీ పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఓపెనింగ్స్ కూడా చాలా బాగా నమోదయ్యాయి. వీక్ డేస్ లో, అలాగే రెండో వీకెండ్లో కూడా ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 3.51 cr
సీడెడ్ 1.26 cr
ఉత్తరాంధ్ర  1.17 cr
ఈస్ట్ 0.61 cr
వెస్ట్ 0.40 cr
గుంటూరు 0.63 cr
కృష్ణా 0.49 cr
నెల్లూరు 0.27 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 8.34 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 1.08 cr
వరల్డ్ వైడ్ టోటల్ 9.42 cr

‘మంగళవారం’ (Mangalavaaram) చిత్రానికి రూ.12 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.12.5 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.9.42 కోట్ల షేర్ ను రాబట్టింది.

బ్రేక్ ఈవెన్ కి ఈ మూవీ మరో రూ.3.08 కోట్లు షేర్ ను రాబట్టాలి. టార్గెట్ అయితే చిన్నది కాదు. కానీ కొత్త సినిమాలు రిలీజ్ అయినా ఈ మూవీ బాగానే పెర్ఫార్మ్ చేసింది అని చెప్పాలి.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus