Maniratnam, Rajinikanth: రజినీకాంత్ ఫ్యాన్స్ ను మెప్పించలేను.. మణిరత్నం కామెంట్స్!

సూపర్ స్టార్ రజినీకాంత్ ను డైరెక్ట్ చేయాలనేది చాలా మంది దర్శకుల కల. అలాంటిది రజినీకాంత్ నేరుగా సినిమా చేస్తానని డైరెక్టర్ ని అడిగితే అతడు నో చెప్పారట. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా..? మణిరత్నం. ఆయన డైరెక్ట్ చేసిన ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో విక్రమ్, జయం రవి, కార్తీ, ఐశ్వర్యారాయ్, త్రిష ఇలా చాలా మంది పేరున్న స్టార్స్ నటించారు. అలానే ప్రకాష్ రాజ్, పార్తీబన్, జయరాం వంటి నటులు సపోర్టింగ్ రోల్స్ చేశారు.

ఆ పాత్రల్లో ఏదొక రోల్ తను చేస్తానని మణిరత్నంని అడిగారట రజినీకాంత్. దానికి మణిరత్నం నో చెప్పారని ‘పొన్నియిన్ సెల్వన్’ ప్రెస్ మీట్ లో రజినీకాంత్ వెల్లడించారు. దీనిపై స్పందించిన మణిరత్నం.. రజినీకాంత్ అభిమానులను తను సాటిస్‌ఫై చేయలేనని.. అందుకే ఆయన ‘పొన్నియిన్ సెల్వన్’లో సపోర్టింగ్ రోల్ చేస్తానని రిక్వెస్ట్ చేస్తే సున్నితంగా తిరస్కరించానని అన్నారు. ఇక ‘పొన్నియిన్ సెల్వన్’ సినిమా ఈ నెలాఖరున ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 30న తొలి భాగం రిలీజ్ అవుతుంది. అది విడుదలైన ఆరు నుంచి తొమ్మిది నెలలకు రెండో భాగం విడుదల కానుంది. ఇప్పటికే సెకండ్ పార్ట్ కి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయింది. పార్ట్ 1కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.. దాన్ని బట్టి పార్ట్ 2లో మార్పులు, చేర్పులు చేసే ఛాన్స్ ఉంది. మణిరత్నం ఆశిస్తున్నట్లుగా ‘పొన్నియిన్ సెల్వన్’ పాన్ ఇండియా రేంజ్ లో వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి!

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus