త్రిష – ఐశ్వర్య సెల్ఫీ పోజు.. సెట్‌లో మణిరత్నం వార్నింగ్‌!

ఇద్దరు హీరోయిన్లు ఓ సెట్‌లో ఉంటే మామూలుగా ఉండదు అని అంటుంటారు సినిమా జనాలు. ఇద్దరికీ పడితే ఓకే… అలా కాకుండా ఒకరంటే ఒకరికి పడలేదా పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. ఒకరి గురించి ఒకరు వాకబు చేసుకుంటూ చిర్రుబుర్రులాడుతూ ఉంటారు. అలాంటి హీరోయిన్ల కాంబినేషన్‌ను గతంలో కొన్నిసార్లు చూశాం. అలా కాకుండా మల్టీస్టారర్‌ సినిమాల్లో ఇద్దరు హీరోయిన్లు కలసి ఎంచక్కా సెట్స్‌లో ఎంజయ్‌ చేస్తుంటారు కూడా. ఇద్దరు హీరోయిన్ల ఫ్రెండ్లీగా ఉండటం చూసి ఆ సినిమా దర్శకుడు వార్నింగ్‌ ఇచ్చారు అంటే నమ్ముతారా? కానీ ఇది జరిగింది.

అది కూడా చిన్న దర్శకుడేం కాదు, చిన్న సినిమా కూడా కాదు. ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 1’ సినిమా షూటింగ్‌ జరిగిందే పైన చెప్పిన కథంతా. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో త్రిష, ఐశ్వర్య రాయ్‌ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ ఇద్దరూ సెట్స్‌లో సరదాగా ఉండేవారట. దీంతో మణిరత్నం ఇద్దరికి క్లాస్ తీసుకున్నారట. మీరిద్దరూ సెట్స్‌లో ఇలా కలసి తిరగొద్దు అని గట్టిగానే చెప్పారట. దీని వెనుక పెద్ద కారణమే ఉంది.

ఈ సినిమాలో ఐశ్వర్య, త్రిష బద్ధ వ్యతిరేకులుగా కనిపిస్తారట. ఇద్దరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గున మండుతుందట. అలాంటి ఇద్దరూ స్నేహంగా ఉంటే యాక్షన్‌ చెప్పగానే ఫీల్ ఉండదేమో అని ఆయన భయమట. అంతేకాదు కొన్ని సన్నివేశాల విషయంలో ఫీల్‌ రాక మణిరత్నం ఇబ్బంది పడ్డారట. దీంతో చూసీ చూసీ ఓ రోజు సెట్‌లో ఇద్దరినీ పిలిచి వార్నింగ్‌ ఇచ్చారట.

మణిరత్నం హెచ్చరిక తర్వాత సెట్స్‌లో ఐశ్వర్యకు త్రిష కాస్త దూరంగా ఉందట. అప్పటి నుండి సినిమా విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదట. దీంతో మణిరత్నం ఊపిరి పీల్చుకున్నారట. కల్కి కృష్ణమూర్తి రచించిన ‘పొన్నియన్ సెల్వన్’ నవల ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం సెప్టెంబర్ 30న వస్తోంది. ఈ సినిమాలో విక్రమ్‌, కార్తి, జయం రవి తదితరులు ఇతర ముఖ్య పాత్రధారులు.

ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

శాకిని డాకిని సినిమా రివ్యూ & రేటింగ్!
నేను మీకు బాగా కావాల్సినవాడిని సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ గీతు రాయల్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus