మహేష్ బాబు అక్క షాకింగ్ కామెంట్స్..!

మహేష్ బాబు అక్క మంజుల అందరికీ సుపరిచితమే. అయితే మహేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు ఈమె హీరోయిన్ గా నటించాలి అనుకుందట. కానీ కృష్ణ గారి అభిమానులు ఈ విషయం తెలుసుకుని ఫైర్ అయ్యారట. చెప్పాలంటే బాలకృష్ణ సినిమాలో మంజుల ఓ హీరోయిన్ గా నటించాల్సి ఉంది. కానీ అభిమానులు ఆమె హీరోయిన్ గా నటిస్తే పెట్రోల్ పోసుకుని చచ్చిపోతాం అంటూ బెదిరిచారట. స్టూడియో వద్దకు వచ్చి ఆ పని చెయ్యడానికి ప్రయత్నిస్తే కృష్ణ గారు వచ్చి ‘మా అమ్మాయి హీరోయిన్ గా నటించదు’ అని చెప్పి వారిని చల్లార్చారట. అయితే అది వరమో.. శాపమో మంజులకు అర్థం కాలేదట.

నటి అవ్వాలి అనుకున్న తన కోరిక తీరలేదు.నా కలలన్నీ నాశనమైపోయాయి అనే బాధతో డిప్రెషన్ కు వెళ్లిపోయిందట. కానీ మెడిటేషన్ ఈమెను ఆదుకుని నార్మల్ అయ్యేలా చేసిందట. నటి అవ్వకపోతే ఏమిటి.. సరికొత్త పద్దతిలో తనని తాను ప్రూవ్ చేసుకోవాలి అనుకుంది. ‘షో’ అనే చిత్రాన్ని చేసి నేషనల్ అవార్డుని రప్పించింది.తన తమ్ముడు మహేష్ తో ‘పోకిరి’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమా నిర్మించింది. ‘ఏ మాయ చేసావే’ వంటి కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ ని నిర్మించి ప్రేక్షకులకు అందించింది. రాంచరణ్ ‘ఆరెంజ్’ సినిమాలో కూడా ఓ కీలక పాత్ర పోషించి మంచి నటిగా కూడా ప్రూవ్ చేసుకుంది.

దర్శకురాలిగా కూడా మారి ‘మనసుకు నచ్చింది’ అనే చిత్రాన్ని తెరకెక్కించింది. నటి అవ్వడం అనేది.. ఆమె డెస్టినేషన్, డెస్టినీ కాదు అని గ్రహించి. నటి అవ్వాలి అనే కల నాశనం అయిపొయింది అని బాధపడినా.. అంతకు మించి ప్రూవ్ చేసుకుందనే చెప్పాలి. ఆమె ఇలా కొత్తమార్గంలోకి వెళ్ళిన ప్రయాణం గురించి అందరికీ చెప్పుకోడానికి.. ఓ యూట్యూబ్ ఛానెల్ ను పెట్టుకుంది. తన జీవితంలో ఫేస్ చేసిన అనుభవాల గురించి ఎంతో ఇంట్రెస్టింగ్ గా చెప్పుకొస్తుంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus