Lasya: అందరూ చూస్తుండగానే లాస్యకు ప్రపోజ్ చేసిన మంజు!

  • August 8, 2023 / 07:10 PM IST

బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి యాంకర్ లాస్య గురించి చెప్పాల్సిన పనిలేదు ప్రస్తుతం లాస్య మంజునాథ్ అనే వ్యక్తిని వివాహం చేసుకొని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు. అయితే పెళ్లి తర్వాత ఈమె బుల్లితెర కార్యక్రమాలకు కాస్త దూరమయ్యారని చెప్పాలి.పెళ్లి తర్వాత బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లాస్య ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఈ కార్యక్రమం తర్వాత ఏదైనా స్పెషల్ అకేషన్ సమయంలో మాత్రమే ఈమె తన భర్తతో కలిసి బుల్లితెరపై సందడి చేస్తున్నారు.

అదేవిధంగా లాస్య ఒక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించి తనకు సంబంధించిన ఎన్నో విషయాలను యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు.ఇక ఈమె తన ఇద్దరు పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా గడుపుతూ వారి పిల్లలకు సంబంధించిన విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటూ ఉన్నారు. ఇదిలా ఉండగా లాస్య మంజునాథ్ ఇద్దరూ కూడా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

అయితే తాజాగా మరోసారి మంజునాథ్ తన భార్య (Lasya) లాస్య పై ఉన్నటువంటి ప్రేమను బయటపెట్టారు. ఈసారి మంజునాథ్ ఏకంగా సినిమా థియేటర్లో అందరూ చూస్తుండగానే సినిమాని అనుకరిస్తూ ఈయన ఒక రోజ్ లాస్యకు ఇస్తూ మోకాళ్ళపై కూర్చొని తనకు ప్రపోజ్ చేశారు.ఇలా థియేటర్లో తన భార్యకు ఈయన ప్రపోస్ చేయడం చూసినటువంటి ప్రేక్షకులు పెద్ద ఎత్తున కేకలు వేస్తూ సందడి చేశారు.

ఇలా తన భర్త తనకు ప్రపోజ్ చేసినటువంటి ఈ వీడియోని లాస్య సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన ఆనందాన్ని తెలియజేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వీరిద్దరూ సూర్య హీరోగా నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా ప్రస్తుతం రీ రిలీజ్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ సినిమా రి రిలీజ్ కావడంతో ఈ థియేటర్లోనే మంజునాథ్ లాస్యకు ప్రపోజ్ చేసి తనకు సర్ప్రైజ్ ఇచ్చారు.

ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus