Anshu: హాట్ టాపిక్ గా మారిన.. ‘మన్మథుడు’ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

‘మన్మథుడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అన్షు అంబానీ అందరికీ గుర్తుండే ఉంటుంది. తర్వాత ఆమె ‘రాఘవేంద్ర’ సినిమాలో కూడా నటించింది. ఇక ‘మిస్సమ్మ’ సినిమాలో కూడా చిన్న పాత్ర చేసింది. తమిళంలో ఈమె ప్రశాంత్ కి జోడీగా చేసిన ‘జై’ తర్వాత నటనకు దూరమైంది. తర్వాత ఈమె పెళ్లి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఇటీవల ఈమె ఇండియాకు వచ్చింది. ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమె ఊహించని కామెంట్స్ చేసింది.

అన్షు మాట్లాడుతూ.. “నేను ఇంగ్లాండ్ నుండి వచ్చినప్పుడు ‘మన్మథుడు’ సినిమాలో ఛాన్స్ లభించింది.ఆ సినిమా టైంకి నా వయసు 16 ఏళ్ళు మాత్రమే. అంతేకాదు.. ఆ టైంలో నా పక్కన ఎప్పుడూ మా నాన్న ఉండేవారు. దీంతో షూటింగ్ టైంలో నేను చాలా ఇబ్బందులు పడ్డాను. నేనంటూ సొంతంగా ఏమీ చేయలేకపోయేదాన్ని. ఎవరితో మాట్లాడాలన్నా, కలవాలన్నా మా నాన్నగారితో చెప్పాల్సి ఉండేది. అందుకే నాకు ఇబ్బందిగా ఉండేది.

అందుకే ఆ టైంలో సినిమాలకి కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాను. కానీ తర్వాత కూడా ఏదేదో అయిపోయింది. నేనో బ్రిటిష్ ఇండియన్ ని..! ఇంగ్లాండ్ లో పుట్టినప్పటికీ మా మూలాలు ఇక్కడే ఉన్నాయి. ఇండస్ట్రీలో నాకు ప్రభాస్ తప్ప తెలిసిన వాళ్లంటూ ఎవ్వరూ లేరు. నా కూతురు బాహుబలి చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యింది.

నేను (Anshu) హీరోయిన్ గా చేసినప్పుడు శ్రియ, ఆర్తి అగర్వాల్, భూమిక, త్రిష వంటి వాళ్ళు లీడ్లో ఉన్నారు. వాళ్లంతా కూడా నాకు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. ఇటీవల నేను ‘గుంటూరు కారం’, ‘భగవంత్ కేసరి’ సినిమాలు చూశాను. ఇప్పుడు నాకు మళ్ళీ సినిమాల్లో నటించాలని ఉంది. అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాను” అంటూ చెప్పుకొచ్చింది.

ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్.!

యూట్యూబ్లో వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ నమోదు చేసిన పాటల లిస్ట్
ఆ విషయంలో నేను బాధ పడలేదు.. ఉపాసన కామెంట్స్ వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
Tags