Manoj Bajpayee’s father RK Bajpayeee: తండ్రిని కోల్పోయిన ఫ్యామిలీ మ్యాన్ హీరో!

ప్రముఖ బాలీవుడ్ నటుడు మనోజ్‌ బాజ్‌పేయి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తండ్రి ఆర్కే బాజ్‌పేయి(83) ఆదివారం నాడు ఉదయం మరణించారు. కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన్ను ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. చికిత్స పొందుతూ.. ఆదివారం నాడు తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలను ఢిల్లీలోని నిగమ్ భోద్ ఘాట్ లో నిర్వహించనున్నారు. ఈ విషయాలను మనోజ్ బాజ్‌పేయి స్పోర్క్స్ పర్సన్ మీడియాకు వెల్లడించారు. ఈ సమయంలో మనోజ్ కి అతడి ఫ్యామిలీకు ప్రైవసీ ఇవ్వమని కోరారు.

బీహార్‌లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో బెల్వా అనే చిన్న గ్రామంలో జన్మించిన మనోజ్‌ తండ్రి కోరిక మేరకు డిగ్రీని పూర్తి చేయడానికి ఢిల్లీ యూనివర్సిటీలో చేరారు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత సినిమా రంగం వైపు అడుగులు వేశారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ పొంది ఆ తరువాత అవకాశాల కోసం ముంబైకి వచ్చారు. ప్రస్తుతం ఈ నటుడు కెరీర్‌ పరంగా దూసుకుపోతున్నాడు. సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీగా గడుపుతున్నారు. ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ తో అతడి క్రేజ్ మరింత పెరిగింది.

రిపబ్లిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

హిట్ టాక్ వచ్చిన తర్వాత ఈ 10 సినిమాల్లో సీన్స్ లేదా సాంగ్స్ యాడ్ చేశారు..!
‘బిగ్ బాస్5’ ప్రియాంక సింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలు..!
ఇప్పటవరకూ ఎవరు చూడని ‘బిగ్ బాస్5’ విశ్వ రేర్ ఫోటో గ్యాలరీ!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus