కోలీవుడ్ నటుడు మన్సూర్ అలీ ఖాన్ త్రిష పట్ల చేస్తున్నటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు ఎంతటి దుమారాన్ని రేపాయో మనకు తెలిసిందే. లియో సినిమాలో నటించినటువంటి ఈయన త్రిషతో కలిసి తనకు రేప్ సన్నివేశాలలో నటించే అవకాశం రాలేదంటూ ఆమె పట్ల చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద ఎత్తున వివాదానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై త్రిష ఘాటుగా స్పందించారు. అలాగే జాతీయ మహిళా కమిషన్ గా వ్యవహరిస్తున్నటువంటి కుష్బూ కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినటువంటి రోజా నితిన్ చిరంజీవి వంటి వారు కూడా ఈ విషయంపై స్పందిస్తూ త్రిషకు మద్దతు తెలియజేశారు. అయితే రోజు రోజుకు త్రిషకు మద్దతు రావడంతో మన్సూర్ అలీ ఖాన్ బహిరంగంగా త్రిషకు క్షమాపణలు చెప్పారు అయితే ఈ వివాదం ఇంతటితో ముగుస్తుంది అనుకొనే లోపు ఈయన ఒక్కసారిగా ప్లేట్ మార్చారు. నేను తనకు క్షమాపణలు చెప్పలేదని క్షమాపణలు చెప్పాను అనడం పెద్ద జోక్ అంటూ ఈయన తెలియజేశారు.
ఇక ఈయనపై పోలీస్ కేసు నమోదు కావడంతో చెన్నై పోలీసులు (Mansoor Ali Khan) తనని అరెస్టు చేయగా త్రిష పోలీసులను రిక్వెస్ట్ చేస్తూ ఆయనని వదిలేయండి తప్పులు అందరూ చేస్తారు కానీ ఆయన క్షమాపణలను నేను అంగీకరిస్తున్నాను అంటూ కూడా తెలిపారు. కానీ ఈయన మాత్రం నేను చెప్పినటువంటి వీడియో పూర్తిగా వినకుండా నన్ను అపార్థం చేసుకుని నా పట్ల విమర్శలు చేసి నా పరువుకు భంగం కలిగించారు అంటూ ఏకంగా త్రిష కుష్బూ చిరంజీవిపై పరువు నష్టం దావా వేస్తానని ప్రకటించారు.
ఇలా ఈ ముగ్గురిపై పరువు నష్టం దావా వేసి వారి ద్వారా వచ్చిన డబ్బును పేద ప్రజలకు పంచుతాను అంటూ మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలు చేశారు. ఇక ఈయన చెప్పిన విధంగానే మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా వేయడమే కాకుండా కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక ఈ విషయంపై డిసెంబర్ 11వ తేదీ జస్టిస్ సతీష్ కుమార్ ధర్మసానం ముందు విచారణకు రానుంది.
హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!
‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!