అన్నపూర్ణ స్టూడియోలో భారీ అగ్ని ప్రమాదం! – Filmy Focus

అక్కినేని నాగేశ్వరరావు స్థాపించిన ‘అన్నపూర్ణ’ సినీ స్టుడియోలో సోమవారం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ అందుబాటులో ఉన్న నీటితో మంటలను ఆర్పేందుకు స్టూడియో సిబ్బంది యత్నిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది స్టూడియోకు చేరుకున్నారు. నాలుగు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఓ సెట్‌లో చెలరేగిన మంటలు కొద్ది సేపటికే భారీగా విస్తరించడంతో సమీపంలో ఉన్న ‘మనం’ సినిమా సెట్ కూడా అగ్నికి ఆహుతైంది. అక్కినేని ఫ్యామిలీ మూడు తరాలు కలిసి నటించిన ‘మనం’ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా అయిన ‘మనం’ అక్కినేని ఫ్యామిలీ సినిమాలకు నిండుదనం తెచ్చిపెట్టింది. దీంతో ఆ సినిమా సెట్‌ను అప్పటినుంచి అలాగే ఉంచారు. అక్కినేని ఫ్యామిలీ ఎంతో అపురూపంగా చూసుకుంటున్న ‘మనం’ సెట్ ఇలా అగ్నికి ఆహుతవడం ఎంతో నిరాశకు గురి చేసే విషయం.

ఒక్కసారిగా మంటలకు చెలరోగడంతో భయాందోళనకు గురైన స్టుడియో సిబ్బంది బయటకు పరుగులు తీశారు. వీరి హాహాకారాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న నాగార్జున వెంటనే స్టుడియోకు చేరుకున్నారు. ఫైర్ సిబ్బందికి ఫోన్ చేసి, పరిస్థితిని సమీక్షిస్తున్నారు. మీడియాను, ఇతరులను లోపలికి రావొద్దంటూ నాగార్జున రిక్వెస్ట్ చేశారు. టీవీలో అగ్నిప్రమాదం వార్త చూసిన పలువురు సినీ ప్రముఖులు స్టుడియోకు చేరుకుంటున్నారు.

https://www.youtube.com/watch?v=I3XxwYBAJn0

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus