MAY Review: మే నెలలో ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయా?

టాలీవుడ్ ఇండస్ట్రీకి కీలకమైన సీజన్లలో మే నెల కూడా ఒకటనే సంగతి తెలిసిందే. సమ్మర్ లో రిలీజైన సినిమాలకు హిట్ టాక్ వస్తే సినిమాలు కళ్లు చెదిరే స్థాయిలో కలెక్షన్లను సాధిస్తాయని గతంలో పలు సినిమాలు ప్రూవ్ చేశాయి. మే నెలలో మొత్తం 17 సినిమాలు విడుదల కాగా ఈ సినిమాలలో హిట్టైన సినిమాలు ఏవనే ప్రశ్నకు సర్కారు వారి పాట, ఎఫ్3 పేర్లు సమాధానంగా వినిపిస్తున్నాయి. మే ఫస్ట్ వీక్ లో జయమ్మ పంచాయితీ, భళా తందనాన, అశోకవనంలో అర్జున కళ్యాణం విడుదలయ్యాయి.

ఈ సినిమాలలో అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్ గా ఈ సినిమా సక్సెస్ కాలేదు. జయమ్మ పంచాయితీ, భళా తందనాన సినిమాలు రిలీజైన రోజునే ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకోలేదు. మే నెల రెండో వారంలో విడుదలైన సర్కారు వారి పాట మిక్స్ డ్ టాక్ తో మొదలై హిట్ జాబితాలో చేరింది. పలు ఏరియాలలో ఇంకా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉన్నా మే నెల విన్నర్ మాత్రం మహేష్ బాబు అని ప్రూవ్ అయింది.

మే నెల 13వ తేదీన డాన్ సినిమా విడుదల కాగా తక్కువ సంఖ్యలో థియేటర్లలో విడుదల కావడం ఈ సినిమాకు మైనస్ అయింది. తమిళంలో మాత్రం ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. మే నెల మూడో వారంలో డేగల బాబ్జీ, ధగడ్ సాంబ, ధ్వని సినిమాలు విడుదల కాగా ఈ సినిమాలలో ఏ సినిమా కూడా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మే చివరి వారంలో ఎఫ్3, బ్లాక్ సినిమాలు విడుదల కాగా ఈ సినిమాలలో ఎఫ్3 బాగానే కలెక్షన్లను సాధిస్తోంది.

అయితే ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్ల గురించి క్లారిటీ రావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం అయితే ఉంది. అందువల్ల ఈ సినిమాను మే నెల బాక్సాఫీస్ విన్నర్ గా ప్రకటించలేము. రైటర్, దొంగాట, మరికొన్ని సినిమాలు విడుదల కాగా ఈ సినిమాలు థియేటర్లలో కానీ, ఓటీటీలలో కానీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus