Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Maya Petika Review in Telugu: మాయా పేటిక సినిమా రివ్యూ & రేటింగ్!

Maya Petika Review in Telugu: మాయా పేటిక సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 30, 2023 / 06:50 PM ISTByFilmy Focus
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Maya Petika Review in Telugu: మాయా పేటిక సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • రజత్ రాఘవ్ (Hero)
  • పాయల్ రాజ్‌పుత్ (Heroine)
  • పృథ్వీరాజ్, హిమజ, సునీల్, యాంకర్ శ్యామల, విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, శ్రీనివాస రెడ్డి తదితరులు (Cast)
  • రమేష్ రాపర్తి (Director)
  • మాగుంట శరత్ చంద్ర రెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి (Producer)
  • గుణ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్‌ (Music)
  • సురేష్ రగుతు (Cinematography)
  • Release Date : జూన్ 30, 2023
  • జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ (Banner)

ఈ వారం అంటే జూన్ చివరి వారంలో ఎక్కువ సినిమాలే రిలీజ్ అవుతున్నాయి. అందులో ‘మాయా పేటిక’ మూవీ కూడా ఒకటి. పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని అనసూయతో ‘థాంక్యూ బ్రదర్’ అనే చిత్రాన్ని తెరకెక్కించిన రమేష్ రాపర్తి డైరెక్ట్ చేశాడు. టీజర్, ట్రైలర్లు కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందో.. నొప్పించిందో తెలుసుకుందాం రండి :

కథ : ప్రణయ్(ర‌జ‌త్ రాఘ‌వ్), పాయల్(పాయల్ రాజ్ పుత్) ఇద్దరూ చిన్నప్పటినుండీ ప్రేమించుకుంటారు. అయితే పాయల్ కి సినిమాల్లో హీరోయిన్ అవ్వాలనేది కోరిక. ‘లాల్ సింగ్ చద్దా’ లో కరీనా కపూర్ లా అన్నమాట. అయినప్పటికీ ఆమె లవర్ ప్రణయ్ అందుకు ఒప్పుకుని సహకరిస్తాడు.ఈ క్రమంలో ఆమెకి ఓ నిర్మాత మొబైల్ ఫోన్ ని గిఫ్ట్ గా ఇస్తాడు.దానికి పాయల్ కూడా అట్రాక్ట్ అవుతుంది. అయితే ఇది ప్రణయ్ కు నచ్చదు.

దీంతో వీళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అవుతాయి. దీంతో ఈ ఫోన్ ను తన అసిస్టెంట్ కి ఇస్తుంది పాయల్. కానీ అది ఊహించని విధంగా చాలా మంది చేతులు మారుతుంది. అది ఎలా? ఎవరెవరి జీవితాల్లోకి ఈ ఫోన్ వెళ్లి.. ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చింది? సునీల్, శ్యామల , శ్రీనివాస్ రెడ్డి, పృథ్వీ రాజ్, హిమజ వంటి వారి పాత్రలు ఏమిటనేది..? సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

నటీనటుల పనితీరు : పాయల్ రాజ్‌పుత్ మెయిన్ రోల్ చేసింది. ఆమెలో మంచి నటి ఉంది. అయినా సరే ఎందుకో ఈ సినిమాలో కూడా గ్లామర్ కే పరిమితమైనట్టు అనిపిస్తుంది. ఆమె పాత్రకి తగ్గట్టు బాగానే చేసింది. 30 ఇయర్స్ పృథ్వీ చాలా కాలం తర్వాత తన మార్క్ కామెడీతో అలరించాడు. ‘విప్పేయ్’ అంటూ కన్నె కామేశ్వరరావు పాత్రలో కాసేపు నవ్వులు పూయించాడు.’మిర్చి’ కిరణ్ కూడా అక్కడక్కడా నవ్వించాడు. సునీల్, శ్యామల టాక్ మొత్తం టిక్ టాక్ దుర్గారావు అండ్ ఫ్యామిలీని ఇమిటేట్ చేసినట్టు ఉంది.

సో వీళ్ళు ఎలా చేసినా జనాలకి వాళ్ళే గుర్తుకొచ్చారు అని చెప్పాలి. శ్రీనివాస్ రెడ్డి డబ్బు కోసం రకరకాల వేషాలు వేసే వ్యక్తిగా కనిపించాడు.ఇతని పాత్ర రియాలిటీకి చాలా దగ్గరగా ఉంటుంది అని చెప్పాలి. సిమ్రత్ కౌర్, విరాజ్ అశ్విన్ ల మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది.

సాంకేతిక నిపుణుల పనితీరు : ‘మాయా పేటిక’ను కథ చెప్పుకుంటే బాగానే ఉంది. కానీ కథనంలో చాలా కన్ఫ్యూజన్ ఉంది. దర్శకుడు రమేష్ చెప్పాలనుకున్న పాయింట్ అందరికీ అర్థమైనా.. అది ఆకట్టుకునే విధంగా లేదు అని ప్రత్యేకంగా చెప్పాలి.ఫోన్ వల్ల వచ్చే సమస్యలు ఏంటి అన్నది.. మొన్నామధ్య వచ్చిన ‘లవ్ టుడే'(తమిళ్) సినిమాలో బాగా చూపించారు. అయితే ‘మాయా పేటిక’ విషయంలో దర్శకుడు కొంచెం రియాలిటీకి దగ్గరకి వెళ్ళాలి అనుకున్నాడు.

అందులో కూడా తప్పు లేదు.. కానీ అలా ప్రయత్నిస్తున్నప్పుడు కామెడీతో ఇంకా ఇంప్రొవైజ్ చేయాలి అనుకోవడంలో అతను బ్యాలెన్స్ తప్పాడు అని చెప్పాలి. టెక్నికల్ గా కూడా ఈ సినిమాలో చాలా లోపాలు ఉన్నాయి. కన్నె కామేశ్వర రావుగా ’30’ ఇయర్స్ పృథ్వీ ఎపిసోడ్ అలరిస్తుంది. ఏపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ని తలపించేలా ఆయన పాత్ర ఉంటుంది. అతను గతంలో అతను చెప్పిన ‘వెనుక నుంచి వచ్చి వాటేసుకుందాం’ అనుకున్నాను అనే డైలాగ్ ను కూడా ఇందులో వాడేశారు.

విశ్లేషణ: అక్కడక్కడా కొన్ని నవ్వుకునే మూమెంట్స్ తప్ప ‘మాయా పేటిక’ లో అలరించే అంశాలు పెద్దగా ఏవీ లేవు. రన్ టైం 2 గంటల 22 నిమిషాలు మాత్రమే కావడంతో ఓపిక ఉంటే ట్రై చేయొచ్చు. లేదంటే లైట్ తీసుకోవచ్చు.

రేటింగ్ : 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Maya Petika
  • #Payal Rajput
  • #Prudhvi Raj
  • #Rajath Raghav
  • #Ramesh Raparthi

Reviews

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

8 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

9 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

9 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

10 hours ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version