విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తనకు హీరోగా లైఫ్ ఇచ్చిన తరుణ్ భాస్కర్ ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం “మీకు మాత్రమే చెప్తా”. గత శుక్రవారం విడుదలైన ఈ చిత్రానికి పెద్దగా రివ్యూలు రాకపోయినా.. విజయ్ దేవరకొండ పబ్లిసిటీ స్టంట్స్ మాత్రం బాగా పనికొచ్చాయి. దాంతో మీడియం బడ్జెట్ లో రూపొందిన ఈ చిత్రం ఆల్రెడీ సేఫ్ జోన్ లో పడినట్లే.
“మీకు మాత్రమే చెప్తా” తోపాటు విడుదలైన “ఆవిరి”కి కనీస స్థాయి వసూళ్లు కానీ టాక్ కానీ రాకపోవడంతో.. ఆల్మోస్ట్ సోలో రిలీజ్ ను ఎంజాయ్ చేసింది విజయ్ సినిమా. డిజిటల్ రైట్స్ మరియు శాటిలైట్ రైట్స్ తోనే సేఫ్ జోన్ లోకి వచ్చేసిన విజయ్.. వచ్చే శుక్రవారం దాకా హ్యాపీగా మిగతా డబ్బులు కూడా వెనక్కి రాబట్టుకొంటాడు. ఆల్రెడీ ఆమేరకు ప్రమోషన్స్ కూడా మొదలెట్టాడు బాబు.
మీకు మాత్రమే చెప్తా సినిమా రివ్యూ & రేటింగ్!
విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!.