Meera Antony: మీరా మృతిపై తల్లి ఎమోషనల్ కామెంట్స్.. ఏం చెప్పారంటే?

విజయ్ ఆంటోని ఫాతిమా కూతురు మీరా ఆంటోని ఆత్మహత్య చేసుకుని మృతి చెందడం సినీ అభిమానులను షాక్ కు గురి చేసింది. మీరా బలవన్మరణం గురించి తల్లి ఫాతిమా మాట్లాడుతూ “నిన్ను నా గర్భంలో మోశానమ్మా.. నాతో ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా” అని కామెంట్ చేశారు. మీరా తల్లి చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. విజయ్ ఆంటోని కుటుంబానికి వచ్చిన ఈ కష్టం మరే కుటుంబానికి రాకూడదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మీరా (Meera Antony) మృతిపై తల్లి ఫాతిమా చేసిన ఎమోషనల్ కామెంట్స్ విజయ్ ఆంటోని అభిమానులను సైతం కంటతడి పెట్టిస్తున్నాయి. మీరా మృతిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతుండగా దర్యాప్తు తర్వాత మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. మీరా ఆంటోని రాసినట్టు ఒక సూసైడ్ లెటర్ వైరల్ అవుతుండగా ఆ లెటర్ ను మీరా రాశారో లేదో క్లారిటీ రావాల్సి ఉంది.

విజయ్ ఆంటోని సాధారణంగా వివాదాలకు దూరంగా ఉంటారు. తమిళంలో ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలో నటించి విజయ్ ఆంటోని ప్రశంసలు అందుకున్నారు. బిచ్చగాడు, బిచ్చగాడు2 సినిమాలతో విజయ్ ఆంటోని తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ రెండు సినిమాలు తెలుగు డిస్ట్రిబ్యూటర్లకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించడం గమనార్హం. కూతురు మరణం వల్ల విజయ్ ఆంటోనిని ఓదార్చడం ఎవరి తరం కావడం లేదని తెలుస్తోంది.

మరికొన్ని వారాల పాటు విజయ్ ఆంటోని షూటింగ్ లకు దూరంగా ఉండనున్నారని సమాచారం అందుతోంది. విజయ్ ఆంటోని బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన ఎంతోమందిని ప్రోత్సహించారు. టాలెంట్ ఉన్న ఎంతోమందిని ప్రోత్సహించిన విజయ్ ఆంటోని కుటుంబంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం ఫ్యాన్స్ ను ఎంతగానో బాధ పెడుతోంది. విజయ్ ఆంటోని కుటుంబం ఈ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.

మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus