మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు 11 సంవత్సరాలకు తల్లిదండ్రులుగా మారారు. ఇలా పెళ్లైన 11 సంవత్సరాలకు ఈ దంపతులు తల్లిదండ్రులకు మారడంతో మెగా కుటుంబంతో పాటు మెగా అభిమానులను కూడా ఎంతో సంతోషం నెలకొంది. ఈ విధంగా వారసురాలు జూన్ 20 వ తేదీ జన్మించడం ఆ చిన్నారికి క్లిన్ కారా కొణిదెల అని పేరు పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఈ చిన్నారికి సంబంధించి ఏ చిన్న విషయం తెలిసిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారుతుంది.
ఇక ఉపాసన ప్రతి ఒక్క విషయంలోనూ ఎంతో జాగ్రత్తగా ఉంటారు అనే విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తనకు కూతురు జన్మించిన తర్వాత తన కూతురు విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ముఖ్యంగా ఈ చిన్నారిని చూడటం కోసం ఎంతోమంది సెలబ్రిటీలు మెగా ఇంటికి వెళ్తున్నారట ఆ సమయంలో ఉపాసన తన కూతురిని చూపించడం కోసం భారీగా కండిషన్స్ పెడుతున్నారని తెలుస్తోంది.
ఎవరైనా సరే చిన్నారిని చూడడం కోసం వెళితే మొబైల్ ఫోన్స్ అసలు తీసుకొని వెళ్ళకూడదట. ఇలా చిన్నారి ఫోటోలు బయటకు వెళ్లకుండా ఉపాసన జాగ్రత్త పడుతున్నారు. అదేవిధంగా తనని టచ్ చేయకుండా చూడాలనే కండిషన్ కూడా పెట్టారట. పాపను అందరూ టచ్ చేయటం వల్ల తొందరగా ఇన్ఫెక్షన్స్ ఓకే ప్రమాదం ఉండడంతోనే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
ఇక మెగా మనవరాలను (Klin Kaara) సైతం ఉపాసన దూరంగా పెట్టారని తెలుస్తోంది. మిగతా పిల్లలందరూ కూడా క్లిన్ కారాను దూరం నుంచి చూస్తూ తనని ఆడిస్తున్నారు తప్ప తనని టచ్ కూడా చేయట్లేదట ఇలా చిన్నారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాసన ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలుస్తోంది.అయితే ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఇతర నేటిజన్స్ మాత్రం ఇది చాలా టూమచ్ కూతురిని చూడడం కోసం ఇన్ని కండిషన్ లో అవసరమా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!
రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్ ఫోటోలు వైరల్!