వరుస రీమేక్ లు.. హర్ట్ అవుతోన్న మెగా ఫ్యాన్స్!

  • October 26, 2020 / 06:09 PM IST

మెగాబ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ వరుసబెట్టి సినిమాలు అనౌన్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయం మెగాభిమానులను డిజప్పాయింట్ చేస్తుంది. దానికి కారణం చిరు, పవన్ పోటీ పడి మరీ రీమేక్ కథలను ఓకే చెబుతుండడమే. తాజాగా పవన్ కళ్యాణ్ మలయాళంలో సూపర్ హిట్ అయిన ‘అయ్యప్పనుం కోషియుం’ రీమేక్ లో నటించబోతున్నారనే విషయం బయటకి వచ్చింది. ముందు ఈ సినిమాలో హీరోగా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ ఫైనల్ గా పవన్ కళ్యాణ్ ని ఫిక్స్ చేశారు.

‘అప్పట్లో ఒకడుండేవాడు’ సాగర్ చంద్ర ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయనున్నారు. ఈ సినిమా మళయాలంలో సూపర్ హిట్ అని తెలియగానే.. తెలుగు ప్రేక్షకులు కూడా పడి పడి చూశారు. ఇది తెలుగులో కమర్షియల్ గా వర్కవుట్ అవ్వదనీ.. పవన్ కి తగ్గ ఎలివేషన్ ఉన్న సినిమా కాదనీ వాదిస్తున్నారు. నిజానికి పవన్ ‘పింక్’ రీమేక్ ఎన్నుకున్న సమయంలో కూడా కొంత వ్యతిరేకత ఎదురైంది. ఇప్పుడు మరోసారి రీమేక్ కథను ఎన్నుకోవడంతో సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ తమ వ్యతిరేకతను చూపిస్తున్నారు అభిమానులు.

రీమేక్ అంటే సినిమాపై ఎగ్జైట్మెంట్ ఉండదని.. తమ బాధను చెప్పుకుంటున్నారు. మరోపక్క చిరంజీవి కూడా ‘ఆచార్య’ సినిమా తరువాత వరుసగా.. ‘లూసిఫర్’, ‘వేదాళం’ లాంటి మాస్ మసాలా సినిమాల రీమేక్ లను లైన్లో పెట్టడం కూడా అభిమానులను బాధిస్తోంది. మరి వీరి బాధ హీరోలకు అర్ధమవుతుందో లేదో చూడాలి!

Most Recommended Video

కలర్ ఫోటో సినిమా రివ్యూ & రేటింగ్!
24 గంటల్లో అత్యధిక లైక్స్ ను సాధించిన టాప్ 20 టీజర్లు ఇవే..!
టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus