మెగా కుటుంబం నుంచి మరో హీరో లాంచ్ కావడానికి అంతా సిద్ధమైంది. మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కానుగంటి కళ్యాణ్ త్వరలో కెమెరా ముందుకు రానున్నారు. జతకలిసే అనే సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న రాకేశ్ శశి దర్శకత్వంలో నటించబోతున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్లో సాయి కొర్రపాటి నిర్మించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ఫిక్స్ అయింది. వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా గురించి ఆసక్తికర సంగతి బయటికి వచ్చింది. ఈ కథ మొదట యువ హీరో నిఖిల్ వద్దకు వెళ్ళిందంట.
ఈ స్టోరీలో తండ్రి, కొడుకు మధ్య సెంటిమెంట్ బాగున్నప్పటికీ తన ఇమేజ్ కి సెట్ కాదని తిరస్కరించినట్లు తెలిసింది. ఈ కథ తన ఎంట్రీకి బాగా పనికొస్తుందని భావించిన కళ్యాణ్ ఒకే చెప్పారని ఫిలిం నగర్ వాసులు చెప్పారు. అయితే ఈ కథను మెగాస్టార్ చిరంజీవి ఇంకా వినలేదంట. ఆయన సైరా నరసింహారెడ్డి చిత్ర షూటింగ్ లో బిజీగా ఉండడంతో దీనిపై దృష్టి పెట్టలేదని తెలిసింది. చిరు కథని పూర్తిగా విని ఎటువంటి మార్పులు చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ మూవీ వెంటనే పట్టాలెక్కేస్తుందని సమాచారం. అందుకే మామ మాట కోసం అల్లుడు వెయిటింగ్ చేస్తున్నారు.