భయపడుతున్న మెగా హీరో!!

టాలీవుడ్ లో మెగా స్టార్ ఫ్యామిలీ నుంచి రోజుకో హీరో దిగుతున్నారు. అయితే అందులో దాదాపుగా అందరూ సక్సెస్ అయిన వాళ్లే. ఇదిలా ఉంటే తాజాగా మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ సైతం వస్తున్న విషయం తెలిసిందే. మెగా బ్రదర్ నాగబాబు పుత్రిక నిహారిక కొణిదెల “ఒక మనసు సినిమా” అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే యూట్యూబ్ లో ‘ముద్దపప్పు- ఆవకాయ”అనే వెబ్ సీరీస్ చేస్తున్న నిహారిక, ఆ షార్ట్ ఫిల్మ్ లో తన అభినయంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే హీరోయిన్ కు ఉన్నంత గ్లామర్ లేకపోయినప్పటికీ తన అభినయంతో మంచి పేరు తెచ్చుకుంటుంది. ఇక బుల్లి తెరపై ఈమె ఎంట్రీకి బుల్లి తెర అభిమానులు బ్రహ్మరధం పట్టిన సంగతి తెలిసిందే. ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ అసలు మ్యాటర్ ఒకటి ఉంది అదేమిటంటే మధురా శ్రీధర్, టివి-9 కలిసి నిర్మిస్తున్న ఒక మనసు సినిమా ఖచ్చితంగా సక్సెస్ కొట్టేలా ఉంది అన్న టాక్ టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తుంది. నాగ శౌర్య హీరోగా చేస్తున్న సినిమాలో మెగా వారసురాలు నిహారిక హీరోయిన్ కాగా మల్లెల తీరంలో సిరిమల్లె చెట్టు దర్శకుడు రామరాజు ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ఒక వేళ నిహారిక ఫస్ట్ మూవీ సూపర్ హిట అయితే అన్న వరుణ్ తేజ కు ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే వరుణ్ ఇప్పటివరకూ చేసిన సినిమాల్లో కంచె మినహా మిగిలిన సినిమాలు రెండూ బాక్స్ ఆఫీస్ వద్ద డమాల్ మన్నాయి.ఇక ఇదే కోవలో తన చెల్లెలు తొలి సినిమా హిట్ కొడితే అన్నగా ఎంత సంతోషించినా….చెల్లెలు హిట్ కొడితే అన్న ఇంకా హిట్ ట్రాక్ ఎక్కలేకపోయాడనే మాట పడాల్సి వస్తుందని భయ పడుతున్నాడు వరుణ్ తేజ్. ఇక అదే జరిగితే రేపటి నుంచి పబ్లిక్ గా వరుణ్ పై సటైర్స్ పడటం ఖాయంగా కనిపిస్తుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus