ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా కాలింగ్ సహస్ర టీజర్ రిలీజ్

  • April 1, 2022 / 07:37 PM IST

జబర్దస్త్ కమెడియన్‌గా, ప్రోగ్రాం హోస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుడిగాలి సుధీర్ వెండితెరపై కూడా తన మార్క్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మేరకు డిఫరెంట్ స్టోరీస్ ఎంచుకుంటూ హీరోగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటికే సుధీర్ నటించిన సాఫ్ట్‌వేర్ సుధీర్, 3 మంకీస్ సినిమాలు విడుదలై ప్రేక్షకుల రెస్పాన్స్ తెచ్చుకోగా.. ఇప్పుడు ‘కాలింగ్ సహస్ర’ అనే డిఫరెంట్ క్రైం స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు సుడిగాలి సుధీర్.

Click Here To Watch NOW

తాజాగా కొద్దిసేపటి క్రితం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చేతుల మీదుగా కాలింగ్ సహస్ర టీజర్ రిలీజ్ చేశారు. ఈ మేరకు చిత్రయూనిట్‌కి బెస్ట్ విషెస్ చెప్పారు అల్లు అరవింద్. ఒక నిమిషం 18 సెకనుల నిడివితో కూడిన ఈ టీజర్‌లో చూపించిన ప్రతి సన్నివేశం కూడా సినిమాపై ఆసక్తి పెంచేసింది. ఈ వీడియో చూస్తుంటే గతంలో ఎన్నడూ చూడని సరికొత్త క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని స్పష్టమవుతోంది.

‘బ్రతకడం కోసం చంపడం సృష్టి దర్మం. మరి చంపడం తప్పు కానప్పుడు దాన్ని చూపించడం తప్పెలా అవుతుంది’ అనే డైలాగ్ తో ప్రారంభమైన ఈ టీజర్ ఆధ్యంతం మిస్టరీని తలపించింది. ‘చివరగా చావంటే కేవలం ప్రాణం పోవడం కాదురా, మన కళ్ల ముందు మనం ప్రేమించిన వాళ్ళు పోవడం’ అంటూ ఈ మూవీలో లవ్ యాంగిల్ కూడా ఉందని చూపించారు.

ఆర్ఆర్ఆర్ సినిమా రివ్యూ & రేటింగ్!


‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus