కార్ వ్యాన్ సంస్కృతి పై మండిపడ్డ మెగాస్టార్..!

మెగాస్టార్ చిరంజీవి కార్ వ్యాన్ సంస్కృతి పై మరోసారి మండిపడ్డారు. గత కొద్ది రోజులుగా ఈ అంశం పై మెగాస్టార్ చర్చిస్తున్న సంగతి తెలిసిందే. కార్ వ్యాన్ అనేది నటీనటుల అవసరాలకు తగినట్టుగా వాడుకోవాలి తప్ప.. దానిని ప్రెస్టీజియస్ గా తీసుకోకూడదు అని ఈమధ్య ఆయన కొంతమంది నటీనటుల దగ్గర తెలిపారు. ఇప్పుడు ఈ అంశం పై ప్రతీ ఒక్కరూ స్పందిస్తున్నారు. “కారవ్యాన్స్ ని నటీనటుల అవసరాలకు వాడుకోవాలి తప్ప లగ్జరీలకు కాదు. పదేళ్ల క్రితం ‘శంకర్ దాదా ఎం.బి.బి.ఎస్ సినిమా షూటింగ్ సమయంలోనే నేను అభిప్రాయపడ్డాను. నాతో పాటు మిగతా నటులకి కూడా కారవ్యాన్స్ ఉంటే బాగున్ను కదా అని, కానీ ఈ పదేళ్లల్లో పరిశ్రమలో చాలా మార్పులొచ్చాయి. నా వరకూ నేను వాష్ రూం కి వెళ్లడానికి,మేకప్ వేసుకోవడానికి తప్ప మరే విషయానికి కారవ్యాన్ వాడేవాన్ని కాదు. నటీనటుల అవసరాల మేరకే కారవ్యాన్స్ ఉండాలని కోరుకున్నాను.. కానీ ఇప్పుడు షాట్ కి షాట్ కి మధ్య గ్యాప్లో.. వెళ్లిపోయి కారవాన్లో కూర్చుంటున్నారు.అది సరైంది కాదు. అసిస్టెంట్ డైరెక్టర్.. జీవితం కూడా సగం అక్కడే అయిపోతుంది.” అంటూ మెగాస్టార్ తన ఆవేదన వ్యక్తం చేశారు.

Mega Star Chiranjeevi fires on using karvan1

మెగాస్టార్ చేసిన ఈ కామెంట్స్ కు మురళీ మోహన్, అంబికా కృష్ణ, తమ్మారెడ్డి భరధ్వాజ్ వంటి సినీ పెద్దలు కూడా ఏకీభవించారు. ‘చిరంజీవి గారు చెప్పింది నూటికి నూరుపాళ్లు నిజం. కొంతమంది నటులు కార్ వ్యాన్ ను ఓ ప్రెస్టేజ్ సింబల్ లా చూస్తున్నారు. షాట్ అయిపోగానే మిగిలిన నటులతో కలిసి కూర్చోవడానికి నామోషీగా ఫీలయ్యి.. వెళ్లి కార్ వ్యాన్ లో కూర్చుంటున్నారు. పైగా వాటి డబ్బులు కూడా నిర్మాతే చెల్లించాలి. అలా షూటింగ్ పూర్తయ్యే వరకూ కొన్ని కోట్ల రూపాయలు వృధా అయిపోతుంది” అంటూ వారు చెప్పుకొచ్చారు. ఏమైనా ఇప్పుడు ఈ అంశం పై తెగ డిస్కషన్లు జరుగుతున్నాయి. ఏమైనా జీరో నుండీ హీరోగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వాళ్ళకే… నిర్మాతలు కష్టాలు అర్థమవుతాయి చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Most Recommended Video

యురేక సినిమా రివ్యూ & రేటింగ్!
మధ సినిమా రివ్యూ & రేటింగ్!
మన టాలీవుడ్ డైరెక్టర్స్ మరియు వారి భార్యలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus