మెగాస్టార్ చిరంజీవి సుడిగాలి పర్యటనకు ఏర్పాట్లు

మెగాస్టార్ చిరంజీవి సినిమాలను వదిలి రాజకీయంలోకి అడుగు పెట్టడం.. ప్రజారాజ్యం పార్టీ స్థాపించడం.. ఆ పార్టీని కాంగ్రెస్ లో కలిపేయడం.. మంత్రిగా కొనసాగడం.. మంత్రి పదవీ కాలం పూర్తవడం.. అంతా ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీలా జరిగిపోయింది. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా సినిమాలు చేసుకుంటున్నారు. సైరా నరసింహా రెడ్డి షూటింగ్ లో చిరు బిజీగా ఉన్నారు. అయితే అతను మళ్ళీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉందని తెలిసింది. తెలుగు రాష్ట్రాల ఎన్నికల్లో కావచ్చు.. ఇంకా సమయం ఉంది అని లైట్ తీసుకోకండి.. ప్రస్తుతం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో దిగనున్నట్టు సమాచారం.

కర్ణాటకలో తెలుగు మాట్లాడే ప్రజలు భారీ ఎత్తునే ఉన్నారు. కొన్ని జిల్లాల పరిధిలో తెలుగు సినిమాల ప్రభావం ఉంటుంది. అలాంటి చోట్ల చిరంజీవితో ప్రచారం చేయించుకోవాలని కన్నడ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ విషయంలో చిరంజీవి కూడా సంప్రదించారని, అందుకు చిరు ఓకే చెప్పినట్లు ఏపీ కాంగ్రెస్ నేతలు వెల్లడించారు. సైరా షెడ్యూల్ గ్యాప్ లో ఒక రోజు కర్ణాటకలో సుడిగాలి పర్యటన చేసి, కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారం చేయనున్నారని కొంతమంది కాంగ్రెస్ నేతలు టీవీ షోల్లో చెబుతున్నారు. చిరంజీవి మాత్రం ఈ విషయం పై ఇంకా స్పందించలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus