నా పిల్లలు నా శృంగార సన్నివేశాలను చూడకూడదు : మేగన్ ఫాక్స్
- May 11, 2016 / 11:47 AM ISTByFilmy Focus
హాలీవుడ్ తారలకు శృంగార సన్నివేశాల్లో నటించడం తప్పనిసరి అని చెప్పలేం కానీ.. ఇక్కడ మనోళ్ళు లిప్ లాక్ లు పెట్టుకొన్నంత సులభంగా వారు అక్కడ “బెడ్ రూమ్” సీన్స్ లో నటిస్తుంటారు, ఒక్కోసారి జీవించేస్తుంటారు కూడా.
హాలీవుడ్ నటి మేగన్ ఫాక్స్ కూడా “ఆ తరహా” సన్నివేశాలు చాలా చేసింది. అయితే.. ఇకపై మాత్రం అలాంటి సన్నివేశాల్లో నటించకూడదు ఫిక్స్ అయ్యిందట. ఎందుకా అని ప్రశ్నించగా.. “నాకిప్పుడు ఇద్దరు పిల్లలు, త్వరలో మూడో బిడ్డకు కూడా జన్మనివ్వబోతున్నాను. నా పిల్లలు పెద్దయ్యాక.. యూట్యూబ్ లోనో లేక మరెక్కడైనా నా “శృంగార సన్నివేశాలు” చూసి ఇబ్బంది పడకూడదు. ఇప్పటివరకూ నటించడం వేరు, కానీ.. ఇకపై మాత్రం అలాంటి సన్నివేశాల్లో నటించకూడదని స్ట్రాంగ్ గా ఫీక్సయ్యాను” అంటోంది.
నిజమే.. ఒక తల్లికి ఆమె పిల్లలు ఆమె నటించిన శృంగార సన్నివేశాలను చూడడం కంటే నీచమైన పరిస్థితి ఉండదు!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

















