Sp Balasubrahmanyam: గొప్ప సినిమాలకు చిరు దూరం.. బాలు ఏమన్నారంటే..!

మెగాస్టార్ చిరంజీవి,గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం లకు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. వీళ్ళ కాంబినేషన్లో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ కూడా వచ్చాయి. మళ్ళి మళ్ళి ఇది రాని రోజు,చిలుకా క్షేమమా, గువ్వా గోరింకతో, బంగారు కోడి పెట్ట, అబ్బనీ తీయని దెబ్బ, నడక కలిసిన నవరాత్రి… ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళ కాంబోలో చాలా హిట్ సాంగ్స్ ఉన్నాయి. బాల సుబ్రహ్మణ్యం గారిని చిరంజీవి.. ‘బాలు అన్నాయ్’ అని పిలుస్తుంటారు. ఇదే విషయాన్ని బాలు గారు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఓ విషయంలో బాలు గారు చిరంజీవిని నిలదీశారట. ఆ టైములో ‘ఓ తప్పు చేసినప్పుడు.. అది మన ఇంట్లో వాళ్లకు తెలిసినప్పుడు..

తర్వాత ఇంట్లో వాళ్ళను పేస్ చేయడానికి ఎలా ఇబ్బంది పడతామో..’ చిరు కూడా బాలు గారి దగ్గర ఇబ్బంది పడ్డారట. ఇంతకీ చిరుని అంతలా ఇబ్బంది పెట్టే సందర్భాన్ని బాలు ఏం తీసుకొచ్చారు? అనే విషయం తెలుసుకోవాలని చాలా మందికి ఆసక్తిగా ఉంటుంది. అసలు మేటర్ ఏంటంటే.. చిరంజీవి నటించిన ‘స్వయంకృషి’ ‘రుద్రవీణ’ చిత్రాలు బాలు గారికి చాలా ఇష్టమట. ముఖ్యంగా ‘రుద్రవీణ’ చిత్రానికి, బాలసుబ్రహ్మణ్యం జీవితానికి దగ్గర పోలికలు ఉంటాయట. ఈ చిత్రంలో అద్భుతంగా నటించిన చిరుకి..

బాలు గారు పెద్ద ఫ్యాన్ అయిపోయారట.కానీ అటు తర్వాత చిరు అలాంటి సినిమాలు చేయడం మానేశారు.క్లాస్ సినిమా చేసినా వాటికి మాస్ టచ్ ఉండేలా జాగ్రత్త పడుతూ వచ్చారు. దీంతో ఓ రోజు చిరుని.. ‘ఎందుకు ‘స్వయంకృషి’,’రుద్రవీణ’ వంటి చిత్రాలు చేయడం మానేశావ్?’ అంటూ నిలదీశారట బాలు. దానికి ఇంట్లో వాళ్ళు నిలదీసినట్టు చిరు ఫీలయ్యారట. తర్వాత కాసేపటికి.. ‘ఫ్యాన్స్ యాక్సెప్ట్ చెయ్యట్లేదు అన్నాయ్’ అంటూ చిరు సమాధానం ఇచ్చినట్టు ఆయనే ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. నిజానికి ఆ సినిమాలు కమర్షియల్ గా వర్కౌట్ అవ్వలేదు.. అలా అర్ధం వచ్చేలా చిరు.. బాలుతో చెప్పినట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus