RC16: ఆర్సీ 16లో చిరు సర్ ప్రైజ్ నిజమేనా?

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ (Ram Charan) కాంబో మ‌ళ్లీ తెర‌పై సర్ ప్రైజ్ ఇవ్వనుందనే వార్త ప్ర‌స్తుతం మెగా ఫ్యాన్స్‌లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. బుచ్చిబాబు సానా (Buchi Babu Sana) ద‌ర్శ‌క‌త్వంలో రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా రూపొందుతున్న RC16 (RC 16 Movie) ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే ఈ సినిమా రెండు, మూడు షెడ్యూళ్లు పూర్త‌య్యాయి. అయితే తాజాగా చిత్ర యూనిట్ చిరంజీవికి ఓ ముఖ్య‌మైన పాత్ర‌ను డిజైన్ చేసింద‌ని బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ ఇద్ద‌రూ మొదటిసారి మ‌గ‌ధీరలో (Magadheera) బంగారు కోడి పెట్ట సాంగ్‌లో క‌లిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

RC16

ఆ త‌ర్వాత ఆచార్యలో (Acharya) డాడ్ అండ్ స‌న్ కాంబినేష‌న్ లో పూర్తి స్థాయిలో న‌టించారు. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. దీంతో ఆ కాంబోపై అప్ప‌ట్లో పెద్ద‌గా హైప్ రాలేదు. కానీ ఇప్పుడు RC16లో చిరంజీవి మ‌రోసారి చ‌ర‌ణ్‌తో న‌టిస్తార‌నే టాక్ న‌డుస్తోంది. ఈ వార్త నిజ‌మైతే మెగా అభిమానుల‌కు ఇది చాలా పెద్ద ట్రీట్ అవుతుంద‌నే చెప్పాలి. ఆచార్య అనంత‌రం ఈ ఇద్ద‌రు మ‌ళ్లీ తెర‌పై క‌ల‌వాల‌ని అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు.

దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వేగంగా వైర‌ల్ అవుతోంది. అయితే మేక‌ర్స్ ఈ విష‌యాన్ని ధృవీక‌రించాల్సి ఉంది. చిరు పాత్ర సినిమాలో ఎలా ఉండ‌బోతోంద‌న్న‌ది ప్ర‌స్తుతం సస్పెన్స్‌గా మారింది. ఇక రామ్ చ‌ర‌ణ్ విష‌యానికి వ‌స్తే, త‌న మునుపటి చిత్రం గేమ్ ఛేంజ‌ర్ (Game Changer) అభిమానుల‌ను పెద్ద‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. దీంతో RC16పై భారీ అంచ‌నాలున్నాయి. మ‌రి ఈసారైనా రామ్ చ‌ర‌ణ్ సోలోగా పాన్ ఇండియా హిట్ కొడ‌తాడా?

లేక‌ చిరు పాత్ర కూడా సినిమాలో మెయిన్ అట్రాక్షన్‌గా మారుతుందా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. చిరంజీవి సైరా న‌ర‌సింహారెడ్డితో (Sye Raa Narasimha Reddy)  పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేసినా, సినిమా ఆశించిన స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. ఇప్పుడు RC16కి చిరు ఎంట్రీ ఇవ్వ‌డం వాస్త‌వ‌మైతే, ఈ సినిమా మాస్ ఆడియెన్స్‌ను బాగా ఆక‌ర్షించే అవ‌కాశం ఉంది. ఇక మేక‌ర్స్ నుంచి దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus