అభిమానికి మెగాస్టార్ ఆర్థిక సహాయం

మెగాస్టార్ చిరంజీవి తన అభిమానులకు అవసరమైన సమయంలో సహాయంగా ఉంటారని స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఎలాంటి సమస్యలు ఉన్నా సరే వెంటనే స్పందించి వీలైనంత వరకు సహాయం అందించడానికి ప్రయత్నాలు చేస్తారు. చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్, ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా వివిధ స్వచ్ఛంద కార్యకలాపాలు మరియు సామాజిక సేవలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక రీసెంట్ గా ఒక అభిమాని అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నట్లు తెలుసుకున్న మెగాస్టార్ వెంటనే స్పందించి అతనికి వైద్య ఖర్చులకు సహాయం చేశారు.

కడపలోని కదిరి అఖిల భారతీయ చిరంజీవి యువత ఉపాధ్యక్షుడు పి. సురేష్ గత కొన్ని రోజులుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నడు. అతని పరిస్థితి గురించి తెలుసుకున్న మెగాస్టార్ అభిమానికి రూ .1 లక్ష ఆర్థిక సహాయం అందించారు. తన సీనియర్ అభిమాని దుస్థితి గురించి తెలియగానే, చిరు వెంటనే తన వైద్య ఖర్చుల కోసం లక్ష రూపాయలను సురేష్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేశారు. మెగాస్టార్ ఈ విధంగా సహాయం చేయడం కొత్తేమి కాదు.

చాలా సందర్భాల్లో అభిమానులకు తనవంతు సహాయం అందిస్తూ వస్తున్నారు. ఎలాంటి కష్టం ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని చాలా మీటింగ్స్ లలో మెగాస్టార్ అభిమానులకు వాగ్దానం చేయడమే కాకుండా ఇలాంటి సందర్భాల్లో తన నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నారు.

Most Recommended Video

కాపటధారి సినిమా రివ్యూ & రేటింగ్!
దృశ్యం 2 సినిమా రివ్యూ & రేటింగ్!
ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus