సమంత రెండో పెళ్లి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అక్కినేని నాగ చైతన్యతో విడాకుల తర్వాత, తాజాగా దర్శకుడు రాజ్ నిడిమోరును సామ్ పెళ్లాడటంపై ఇంటర్నెట్‌లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఆమెపై జరుగుతున్న నెగిటివ్ ట్రోలింగ్‌కి సీనియర్ నటి హేమ తనదైన శైలిలో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.తాజాగా ఓ ఇంటర్వ్యూలో హేమ మాట్లాడుతూ..”నాగ చైతన్య రెండో పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరూ నోరు మెదపలేదు.
మరి సమంత చేసుకుంటేనే ఎందుకు ఇంత రాద్ధాంతం?” అంటూ సూటిగా ప్రశ్నించారు.అబ్బాయి చేస్తే ఒక న్యాయం, అమ్మాయి చేస్తే మరో న్యాయమా అంటూ నెటిజన్లను నిలదీశారు. సమంతకు డబ్బు ఉంది కాబట్టే ఇలా చేస్తోందంటూ కామెంట్స్ చేయడం సరికాదని హేమ మండిపడ్డారు.ప్రస్తుతం సమంత శారీరకంగా, మానసికంగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటోందని, ఈ సమయంలో ఆమెకు కచ్చితంగా ఒక తోడు అవసరమని హేమ అభిప్రాయపడ్డారు.
తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న సామ్‌ను విమర్శించడం మానేసి, కొత్త జంటకు ‘కంగ్రాట్స్’ చెప్పాలని హితవు పలికారు. చట్టబద్ధంగా, ఇష్టపూర్వకంగా జరిగిన ఈ పెళ్లిలో తప్పేముందని ఆమె ప్రశ్నించారు.ఇక నాగ చైతన్య గురించి కూడా హేమ పాజిటివ్‌గానే స్పందించారు. చైతూ చాలా మంచి వ్యక్తి అని, నాగార్జున ఫ్యామిలీ అంతా ‘బంగారం’ లాంటి మనుషులని కితాబిచ్చారు.
వారిద్దరూ పరస్పర అంగీకారంతోనే విడిపోయారని, ఇప్పుడు ఎవరి లైఫ్ వారిదని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో జరిగిన సామ్-రాజ్ వెడ్డింగ్‌పై హేమ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.