స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , ప్రభాస్ (Prabhas) , మహేష్ బాబు (Mahesh Babu) , ఎన్టీఆర్ (Jr NTR), రాంచరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun) వంటి వాళ్ళు వంద కోట్లు పారితోషికం అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ హీరోలతో రీజనల్ మూవీస్ తీసినా రూ.200 కోట్లు వసూల్ చేస్తుంటాయి. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ వంటివి అదనం.అందుకే వీళ్ళకి వంద కోట్లు పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు ఆలోచించరు. అయితే వీళ్ళు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్ ని పక్కన పెడితే..
మిగిలిన హీరోలంతా పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. సో టాలీవుడ్లో ఉన్న స్టార్ డైరెక్టర్లకి హీరోలు దొరకడం లేదు. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరోలే వీళ్ళకి పెద్ద దిక్కులా మారిపోయారు అనడంలో సందేహం లేదు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ స్టార్ హీరోలు భారీగా పారితోషికాలు అందుకుంటున్నారు. ఈ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ముందు వరుసలో ఉన్నారు.
ప్రస్తుతం చిరు .. ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) దర్శకత్వంలో ‘విశ్వంభర’ (Vishwambhara) చేస్తున్నారు. దీనికి దాదాపు రూ.60 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్టు వినికిడి. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారు చిరు. దానికి కూడా దాదాపు అంత మొత్తం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
అయితే ‘దసరా’ (Dasara) దర్శకుడు శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో కూడా చిరు ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. సుధాకర్ చెరుకూరి (Sudhakar Cherukuri) ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమా కోసం చిరు రూ.75 కోట్లు పారితోషికం డిమాండ్ చేసినట్లు తాజా సమాచారం. ఈ సినిమా కథ ‘విక్రమ్’ రేంజ్లో ఉంటుందట. నాని (Nani) కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు టాక్ నడుస్తుంది.