‘సామ్‌జామ్‌’లో బాస్‌ సందడి చూస్తుంటే….!

‘సామ్‌ జామ్‌’ షో మొదలైన కొద్ది రోజులకు ‘చిరంజీవి’ ఎపిసోడ్‌ షూటింగ్‌ జరుగుతోందని వార్తలొచ్చాయి. ఆ తర్వాత ఫొటోలు కూడా వచ్చాయి. అయితే ఎపిసోడ్‌ మాత్రం లైవ్‌ కాలేదు. అదేంటి ఇంకా ఎపిసోడ్‌ ఎప్పుడు లైవ్‌ చేస్తారు అంటూ సోషల్‌ మీడియాలో సందడి మొదలైంది. చిరు ఎపిసోడ్‌ మీద మీమ్స్‌ కూడా వచ్చేశాయి. కానీ ఎపిసోడ్‌ రాలేదు. అయితే అభిమానుల ఎదురు చూపులకు తెర దించుతూ ‘ఆహా’ టీమ్‌ ఇటీవల టీజర్‌ విడుదల చేసింది. అందులో చిరు ఎపిసోడ్‌ క్రిస్మస్‌ కానుకగా అని చెప్పింది. ఇప్పుడు ప్రోమోకు టీజర్‌ లాంచ్‌ చేసింది. అందులో చిరంజీవి సందడి చూస్తుంటే ఎపిసోడ్‌ దద్దరిల్లిపోయేలా ఉంది.

మామలూగా చిరంజీవి కనిపిస్తే హ్యూమర్‌, పంచ్‌లు, కౌంటర్లు ఉంటాయి. అలాంటిది సమంత హోస్ట్‌ అనేసరికి అవి ఇంకా ఏ రేంజిలో ఉంటాయి అంటూ చాలా లెక్కలేసుకున్నారు అభిమానులు. వాటికి ఏ మాత్రం తక్కువ లేకుండా ప్రోమో టీజర్‌ను విడుదల చేశారు. అందులో ‘మీ ఫ్రిజ్‌ లో ఎప్పుడూ ఉండే ఓ ఐటమ్ ఏమిటి?’ అని సమంత మెగాస్టార్‌ను అడిగింది. దానికి ఆయన చేతిలో సైగలు చేశారు. ‘ఆఁ…’ అని అందరూ ఆశ్చర్యపోగా… ‘మీరనుకునేది కాదు’ అంటూ సరదాగా ఆటపట్టించారు. అసలు చిరంజీవి ఏం చెప్పారు అనేది ప్రోమోలో చెప్పేస్తారా? లేక ఎపిసోడ్‌లో చూపిస్తారా అనేది తెలియాలి.

‘సామ్‌ జామ్‌’ అంటేనే ఎవరికీ తెలియని విషయాలు తెలిపే షోగా ఓటీటీయన్స్‌ అంటున్నారు. రానా హెల్త్‌ ఇష్యూష్‌, రకుల్‌ పర్సనల్‌ వ్యూస్‌, క్రిష్‌ ‘మణికర్ణిక’ ముచ్చట్లు… ఇలా చాలా కొత్త కొత్త విషయాలు తెలిశాయి. మరి అదే వేదికపై చిరంజీవి ఏమేం కొత్త విషయాలు చెబుతారా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందులో మీరూ ఉన్నారనే అనుకుంటున్నాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus