Chiranjeevi: మహాత్మకు ఇదే మన నివాళి… చిరంజీవి పోస్ట్ వైరల్!

  • October 3, 2023 / 11:05 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి స్టార్ హీరోగా మాత్రమే కాకుండా ఎంతో మంచి మనసు ఉన్నటువంటి ఒక మానవతావాదని కూడా పేరు ప్రఖ్యాతలు పొందారు. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ సాధించినటువంటి చిరంజీవి తాను సంపాదించే కొంత మొత్తంలో ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఈయన చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. ఈ ట్రస్ట్ 1998 అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతిని పురస్కరించుకొని ఈ ట్రస్ట్ ప్రారంభించారు అలాగే ఈ బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ కూడా ఈయన ప్రారంభించారు.

ఈ విధంగా చిరంజీవి తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి ఎన్నో విధాలుగా సహాయం అందించారు ప్రమాదంలో ఉన్నటువంటి వారందరికీ తన బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం సరఫరా చేసి వారికి పునర్జన్మ ప్రకటించారు దాదాపు పదివేలకు పైగా కంటి చూపు కోల్పోయిన వారికి ఐ బ్యాంకు ద్వారా తిరిగి చూపును ప్రసాదించారు. ఈ విధంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది ప్రయోజనం పొందిన సంగతి మనకు తెలిసిందే

అయితే నేటితో సరిగ్గా ఈ చారిటబుల్ ట్రస్ట్ ప్రారంభించి పాతిక సంవత్సరాలు కావడంతో సోషల్ మీడియా వేదికగా చిరంజీవి చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. మన దేశానికి ఇది ముఖ్యమైన రోజు. నేను చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ (సిసిటి) ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తైంది. అద్భుతమైన ప్రయాణం ట్రస్ట్ పై ప్రేమను ప్రతిబింబిస్తోంది. ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా యూనిట్ల రక్తాన్ని సేకరించి పేదలకు అందించాం.

కరోనా సమయంలో ఎంతోమందికి సహాయంగా నిలిచాము. ఇలా ఇతరులకు సహాయం చేయడంలో మనం పొందే ఆనందం ఎంతో సంతృప్తికరమైనది. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సహాయం చేయడానికి శక్తినిచ్చిన లక్షలాది మంది ఉదార సోదరులు, సోదరీమణులకు సెల్యూట్ చేస్తున్నాను! ఇది మన దేశానికి చేస్తున్న సహకారం! ఇదే మహాత్ముడికి మనం అర్పించే నివాళి అంటూ ఈ సందర్భంగా బ్లడ్ బ్యాంక్ పాతిక సంవత్సరాలు పూర్తి కావడంతో చిరంజీవి (Chiranjeevi) చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది.

స్కంద సినిమా రివ్యూ & రేటింగ్!

చంద్రముఖి 2 సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రిన్స్ యవార్ గురించి 10 ఆసక్తికర విషయాలు !

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus