Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవికి హీరోగా నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది. టాలెంట్ ను ప్రోత్సహించే విషయంలో చిరంజీవి ముందువరసలో ఉంటారు. చిరంజీవితో కలిసి నటించిన హీరోయిన్ల సంఖ్య 80 కంటే ఎక్కువే ఉంటుంది. తనతో కలిసి నటించిన హీరోయిన్ల గురించి చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు. శ్రీదేవి, విజయశాంతి, రాధ, రాధికలలో ఎవరు బెస్ట్ అనే ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేదని చిరంజీవి తెలిపారు. హీరోయిన్లతో అద్భుతమైన కెమిస్ట్రీ ఉండేదని వాళ్లలో ఎవరు బెస్ట్ అని అడిగితే నేను చెప్పలేనని చిరంజీవి పేర్కొన్నారు.

ఒక్కో హీరోయిన్ లో ఒక్కో స్పెషాలిటీ ఉందని చిరంజీవి కామెంట్ చేశారు. సహజంగా, సులువుగా నటించే విషయంలో రాధిక పర్ఫెక్ట్ అని ఆయన అన్నారు. డ్యాన్స్ విషయంలో మాత్రం రాధ, విజయశాంతి పర్ఫెక్ట్ అని వాళ్లు నాతో డ్యాన్స్ చేసే సమయంలో జీవించేస్తారని చిరంజీవి కామెంట్లు చేశారు. రాధ, విజయశాంతి డ్యాన్స్ పవర్ ఫుల్ గా ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. శ్రీదేవి తన ఫేవరెట్ హీరోయిన్ అని చిరంజీవి అన్నారు.

శ్రీదేవితో వృత్తిపరంగా, వ్యక్తిగతంగా రిలేషన్ ఉందని చిరంజీవి చెప్పుకొచ్చారు. శ్రీదేవితో పని చేసిన ప్రతి క్షణాన్ని ఆస్వాదించానని చిరంజీవి అన్నారు. చిరంజీవి శ్రీదేవి కాంబినేషన్ ను ఉత్తమ జంటగా ప్రేక్షకులు భావిస్తారని ఆయన తెలిపారు. శ్రీదేవితో నేను కలిసి నటించిన సినిమాలు అన్నీ హిట్ అయ్యాయని చిరంజీవి పేర్కొన్నారు. డ్యాన్స్ విషయంలో, నటన విషయంలో శ్రీదేవి బెస్ట్ అని చిరంజీవి కామెంట్లు చేశారు.

శ్రీదేవి గురించి చిరంజీవి చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరంజీవి ప్రస్తుతం భోళా శంకర్ సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాతో మెగాస్టార్ మరో హిట్ ను సొంతం చేసుకోవాలని అభిమానులు భావిస్తున్నారు.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus