టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అత్యధిక పారితోషికం తీసుకున్న హీరోగా మెగాస్టార్ చిరంజీవి పేరును సంపాదించుకున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ముప్పై కోట్లకు అటూఇటుగా పారితోషికం తీసుకునే ఏకైక హీరో చిరంజీవి కావడం గమనార్హం. ఈ మధ్య కాలంలో సేవా కార్యక్రమాల ద్వారా చిరంజీవి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే చిరంజీవి తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. చిరంజీవి త్వరలో ఆంబులెన్స్ సర్వీసులను కూడా ప్రారంభించనున్నారని వార్తలు వస్తున్నాయి.
అధికారికంగా ఈ మేరకు ప్రకటన రావాల్సి ఉంది. సామాజిక సేవా స్పృహ కలిగి ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఒకవైపు సినీ కార్మికులను ఆదుకోవడంతో పాటు మరోవైపు పేద ప్రజల సంక్షేమం కొరకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ ఆంబులెన్స్ సర్వీసులను చిరంజీవి ఉచితంగా అందుబాటులోకి తీసుకురానున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రమాద బాధితుల కోసం, ఆపద సమయంలో ఇబ్బందులు పడుతున్న రోగుల కోసం చిరంజీవి ఈ ఆంబులెన్స్ లను వినియోగించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
చిరంజీవి మరో కీలక అడుగు వేయడంతో పేద ప్రజలకు ప్రయోజనం చేకూరనుందని చెప్పాలి. మరోవైపు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ లో యాక్టివ్ గా ఉండటంతో ఏపీలో జనసేన పార్టీ బలపడేందుకు చిరంజీవి కృషి చేస్తున్నారని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి మరో మంచి పనికి శ్రీకారం చుట్టినట్టు వార్తలు వస్తుండటంతో మెగా ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. చిరంజీవి నటించిన ఆచార్య సినిమా ఈ ఏడాది రిలీజ్ కానుంది.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!