మెగాస్టార్ చిరంజీవికి వర్మ కథ అందించనున్నారా?
- January 24, 2017 / 10:13 AM ISTByFilmy Focus
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ విజయాలకంటే వివాదాల్లోనే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తున్నారు. అన్ని విషయాలపై చేతికొచ్చినట్లు ట్వీట్స్ చేసే వర్మ మెగాస్టార్ చిరంజీవిని వదల్లేదు. ఖైదీ నంబర్ 150 చిత్రంపై గత కొన్ని రోజులుగా విమర్శిస్తూ పోస్టులు చేశారు. చిరు ని సైతం ఎగతాళి చేస్తూ కామెంట్స్ చేశారు. కానీ ఆయన రాతల్లో రెండు రోజులుగా మార్పు కనిపిస్తోంది. ఖైదీ నంబర్ 150 బాగుందంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కారణం ఏమిటని ఆరా తీస్తే .. అసలు విషయం బయట పడింది. చిరు కోసం వర్మ ఓ కథ రాస్తున్నారంట. అది పూర్తి అయ్యే సరికి కొంతకాలం పడుతుందని సమాచారం. ప్రస్తుతం వర్మ బిగ్ బి తో సర్కార్ 3 తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం కంప్లీట్ కాగానే చిరు ఇమేజ్ కి తగ్గట్టు కథను సిద్ధం చేయనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.
మెగాస్టార్ ఇప్పుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. 151వ మూవీ తర్వాత వర్మ కథతో సినిమా చేసే అవకాశాలున్నట్టు తెలిసింది. కథ బాగుంటే డైరక్షన్ ఛాన్స్ కూడా ఇస్తానని చిరు మాట ఇచ్చారని వార్త చక్కర్లు కొడుతోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ .. ఈ కాంబినేషన్ తో వచ్చే మూవీపై అంచనాలు భారీగా ఉంటాయి. గతంలో చిరు, వర్మ కలిసి ఓ మూవీ ప్లాన్ చేశారు. ఊర్మిళ, చిరంజీవి పై ఓ పాట కూడా చిత్రీకరించారు. ఆ మూవీ మధ్యలోనే ఆగిపోయింది. మరి ఈ ప్రాజక్ట్ ఎంత వరకు వెళ్తుందో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














