మెగా హీరో సరసన నితిన్ హీరోయిన్
- January 11, 2018 / 01:15 PM ISTByFilmy Focus
తెలుగు చిత్ర సీమలో చిరు కుటుంభం నుండి చాలా మంది హీరోలు వరుసగా సినిమా చేస్తూ బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా చిరంజీవి ఫ్యామిలీ నుంచి మరో ముఖ్య వ్యక్తి సినీరంగ ప్రవేశం చేయనున్నట్లు వార్తలు వచ్చాయి. అతనెవరో కాదు మెగాస్టార్ కుమార్తె శ్రీజ భర్త కళ్యాణ్. సత్యానంద్ దగ్గర యాక్టింగ్ నేర్చుకున్న ఈ అబ్బాయి త్వరలో హీరోగా ఎంట్రీఇవ్వబోతున్నాడు. “జతకలిసే” సినిమాకు దర్శకత్వం వహించిన రాకేశ్ రిషి ఈ సినిమాకు డైరెక్టర్.
తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో “లై” ఫేమ్ మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటించబోతోందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతమేరకు నిజముందో తెలియాలంటే మెగా కాంపౌండ్ నుండి అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోన్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus













