‘భాను శ్రీ’ చేసిన రాజకీయం వల్లే నాకు అన్యాయం జరిగింది..!

ఇటీవల విడుదలైన ‘ఏడు చేపల కథ’ సినిమాకి.. ‘పరమ చెత్త సినిమా’ అంటూ రివ్యూలు వచ్చాయి. క్రిటిక్స్ ఈ చిత్రాన్ని ఓ రేంజ్లో ఏకిపారేశారు. అయితే టీజర్, ట్రైలర్ లకు బాగా టెంప్ట్ అయిన ఓ వర్గం ప్రేక్షకులు మాత్రం.. ఈ చిత్రం కచ్చితంగా చూడాలి అని.. టెంప్ట్ అయ్యి అటెంప్ట్ చేస్తే ‘చుక్కలు కనిపించాయి’ అంటూ వాళ్ళే పబ్లిక్ టాక్ లోనూ, సోషల్ మీడియాలోనూ కామెంట్లు చేశారు. అయితే ఈ చిత్రంలో ‘బిగ్ బాస్2’ ఫేమ్ భానుశ్రీ కూడా ప్రధాన పాత్ర పోషించింది. అయితే ఆమె రాజకీయాలు చేసి మరో హీరోయిన్ కు అన్యాయం చేసిందట.

అసలు విషయం ఏమిటంటే.. ఈ చిత్రం టీజర్, ట్రైలర్ లలో మరో హీరోయిన్ మేఘనా చౌదరి తెగ హల్ చల్ చేసింది. అయితే ఆమెకు సంబందించిన సీన్లు సినిమాలో లేకపోవడంతో ప్రేక్షకులు డిజప్పాయింట్ అయ్యారంటూ చెప్పుకొస్తుంది. నా వల్లే సినిమాకి ఇంత హైప్ వచ్చింది. కానీ నాకు మాత్రం కనీసం గుర్తింపు లేకుండా చేసేసింది.. ‘బిగ్ బాస్2’ భానుశ్రీ. కనీసం ‘బుక్ మై షో’ లో కూడా నా పేరు లేకుండా చేసేసింది అంటూ ఆరోపణలు వ్యక్తం చేసింది. మరి ఈ విషయం పై భాను శ్రీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.!

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus