బిగ్ బాస్ హౌస్ లో 10వ వారం బిగ్ ట్విస్ట్ ఉంటుందని అందరూ ఊహించారు. కానీ, అలాంటింది ఏమీ లేదు. సింపుల్ గా మెహబూబ్ దిల్ సే ని ఎలిమినేట్ చేసేశారు. దీపావళి పండగ సందర్భంగా ఈవారం ఎలిమినేషన్ ప్రోసెస్ ఉండదనే అనుకున్నారు చాలామంది. కానీ, బిగ్ బాస్ నార్మల్ గానే ఎలిమినేషన్ ప్రక్రియని కొనసాగించారు. ఇందులో భాగంగా మెహబూబ్ దిల్ సే హౌస్ నుంచి బయటికి వచ్చేశాడు.
ప్రధానంగా మెహబూబ్ ఎలిమినేట్ అవ్వడానికి 5 కారణాలు చెప్పుకున్నట్లు అయితే..,
1. మెహబూబ్ టాస్క్ లు బాగా ఆడుతున్నప్పటికీ తన గేమింగ్ లో జెన్యూనిటీని చూపించలేకపోయాడు. ఫిజికల్ గా ఎప్పుడు ముందుంటే మెహబూబ్ బ్రైయిన్ తో గేమ్ ని ఆడలేకపోయాడు. క్వాయిన్స్ టాస్క్, రోబో టాస్క్, హోటల్ టాస్క్, పల్లెకిపోదాం టాస్క్, రాక్షసుల టాస్క్ ఇలా అన్నింటిలో కూడా మెహబూబ్ తనని తాను నిరూపించుకోలేకపోయాడని చెప్పాలి. ఎవరైనా తనని ట్రిగ్గర్ చేస్తే ఆవేశపడిపోయాడు. ఫ్రెండ్స్ అయినా సరే టాస్క్ ఆడేటపుడు నోరు జారాడు. ముఖ్యంగా హోటల్ టాస్క్ లో పుచ్చపగిలిపోద్ది అనేది మెహబూబ్ గేమ్ ని దెబ్బతీసింది.
2. మిగతా హౌస్ మేట్స్ గేమ్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తుంటే గమనించలేకపోయాడు. అరియానా, హారిక, మోనాల్ ఈ ముగ్గురూ కూడా మెహబూబ్ ని ఓవర్ టేక్ చేసి వెళ్లిపోయారు. ముఖ్యంగా అరియానా టాస్క్ లలో డామినేట్ చేసేసింది. గడిచిన మూడువారాల్లో మెహబూబ్ కి ఈ అవకాశం రాకుండా పోయింది. అంతేకాదు, ఏదైనా ఆర్గ్యూమెంట్ అవుతున్నా కూడా తనవైపు జెన్యూనిటీ ఉందా లేదా అనేది చెక్ చేసుకోలేకపోయాడు.
3. శాక్రిఫైజ్ అనేది చేయడానికి ఇష్టపడలేదు. ఆఖరి బంతి టాస్క్ లో సోహైల్ కెప్టెన్సీని వదిలేసి వచ్చినపుడు అఖిల్ తో ఆర్గ్యూమెంట్ చేశాడు. నామినేషన్స్ లో ఉన్నాను హెల్ప్ చేయమని అడిగాడు. ఇక్కడే తన గేమ్ దెబ్బతినింది. అఖిల్ కూడా పట్టుదలతో ఉండటం, టాస్క్ రద్దు అవ్వడంతో మెహబూబ్ కి మైనస్ అయ్యింది.
4. ముఖ్యంగా ఈవారం హౌస్ లో స్ట్రాంగ్ ప్లేయర్స్ తో పోటీ పడ్డాడనే చెప్పాలి. మోనాల్, అరియానా, హారిక ఈ ముగ్గురుతో పోలిస్తే బాగా వెనకబడ్డాడు మెహబూబ్. అసలు ఈవారం టాస్క్ లో తనని తాను ప్రూవ్ చేసుకునే స్కోప్ కూడా ఎక్కడా దొరకలేదు. అంతకుముందు పల్లెకిపోదాం టాస్క్ లో హారిక డామినేట్ చేసింది. అలాగే రాక్షసులు టాస్క్ లో అరియానా, బిబి డే కేర్ సెంటర్ టాస్క్ లో సోహైల్ అరియానా ఇలా అందరూ కూడా మెహబూబ్ గేమ్ ని డామినేట్ చేస్తూ ముందుకు వచ్చారు.
5. సోహైల్, అఖిల్ , మోనాల్ ఈ ముగ్గురితోనే ఎక్కువగా టైమ్ స్పెండ్ చేసి, మిగతా హౌస్ మేట్స్ తో దూరంగానే ఉన్నాడు మెహబూబ్. ముఖ్యంగా లాస్య, హారిక, అభిజిత్, నోయల్ ఇలా ఫస్ట్ నుంచీ వీళ్ల గ్రూప్ తో అస్సలు కలవలేదు. అంతేకాదు, అభిజిత్ తో మద్యలో మాట్లాడినట్లుగానే మాట్లాడి మళ్లీ దూరం పెట్టాడు. లాస్ట్ వీక్ అరియానాని నామినేట్ చేస్తూ తను కెప్టెన్ గా ఉన్నప్పుడు ఈక్వల్ వర్క్ ఇవ్వలేదు అనే రీజన్ చెప్పాడు. అది కూడా పర్ఫెక్ట్ రీజన్ లాగా అనిపించలేదు. ఎందుంకంటే, అమ్మ కెప్టెన్ అయినపుడు మెహబూబ్ కూడా వర్క్ విషయంలో పార్షియాలిటీ చూపించాడు. అందుకే అది ఎవరికీ నచ్చలేదనే చెప్పాలి. అదీ మేటర్.
Most Recommended Video
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!