‘ఉప్పెన’ టు ‘కార్తికేయ 2’ .. భారీ కలెక్షన్లు రాబట్టిన 10 మిడ్ రేంజ్ హీరోల సినిమాలు..!

  • September 10, 2022 / 10:58 AM IST

స్టార్ హీరోల సినిమాలు మహా అయితే ఏడాదికి, రెండేళ్ళకి ఒక్కటి వస్తుంది. చిన్న హీరోల సినిమాలు నెలకొకటి చొప్పున వస్తాయి. పెద్ద హీరోల సినిమాలు గ్యాప్ తీసుకుని వచ్చినా.. హిట్ అవుతాయి అనే గ్యారంటీ ఉండదు. ఒకవేళ హిట్ అయితే భారీగా కలెక్ట్ చేస్తాయి.కానీ భారీ లాభాలు మిగులుస్తాయని చెప్పలేము. ఇక చిన్న హీరోల సినిమాలు నెలకు ఒకటి చొప్పున రిలీజ్ అయినా.. హిట్ అయితే తప్ప జనాలు థియేటర్లకు వెళ్లి వాళ్ళ సినిమాలు చూడరు. అయితే వీళ్ళ మధ్య మిడ్ రేంజ్ హీరోలు ఉంటారు. వీళ్ళని టైర్ 2 హీరోలు అంటారు. వీళ్ళ సినిమాలు కనుక పెద్ద హిట్ అయితే పెద్ద సినిమాలకి ఏమాత్రం తీసిపోని విధంగా వసూళ్లు రాబడతాయి. ఇటీవల వచ్చిన ‘కార్తికేయ 2’ చిత్రం ఏకంగా రూ.100 కోట్లు కలెక్ట్ చేసింది. ‘కార్తికేయ 2’ మాత్రమే కాదు గతంలో భారీ కలెక్షన్లు రాబట్టిన మిడ్ రేంజ్ హీరోల సినిమాలు కొన్ని ఉన్నాయి.అది రాజమౌళి డైరెక్షన్లో నాని చేసిన సినిమాలు వంటివి కాకుండా ఉన్న ఆ సినిమాలు అవేంటో ఓ లుక్కేద్దాం రండి :

1) గీత గోవిందం :

విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా నటించిన ఈ మూవీని పరశురామ్(బుజ్జి) డైరెక్ట్ చేశాడు. ‘జి ఎ 2 పిక్చర్స్’ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 125 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

2) ఎఫ్ 2 :

వెంకటేష్- వరుణ్ తేజ్ నటించిన ఈ మల్టీస్టారర్ మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ ఏకంగా రూ.123 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

3) కార్తికేయ 2 :

నిఖిల్ హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ రూ.100 కోట్ల పైగా గ్రాస్ ను కలెక్ట్ చేసింది. అయితే ఈ మూవీ హిందీలో కూడా రిలీజ్ అయ్యింది.

4) ఎఫ్3 :

వెంకటేష్- వరుణ్ తేజ్ నటించిన ఈ మల్టీస్టారర్ మూవీని అనిల్ రావిపూడి డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ రూ.96 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

5) ఫిదా :

వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ మూవీని శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ రూ.86 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

6) ఉప్పెన :

వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన ఈ మూవీని బుచ్చిబాబు సానా డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ రూ.81 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

7) అఆ :

నితిన్- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

8) క్రాక్ :

రవితేజ హీరోగా నటించిన ఈ మూవీని గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేశాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.72 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

9) జాతి రత్నాలు :

నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.70 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

10) ఎం.సి.ఎ :

నాని హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 69 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus