బిగ్ బాస్ నాన్ స్టాప్ హౌస్ లో 10వ వారం నుంచీ ట్విస్ట్ లు చూడబోతున్నామా అంటే నిజమే అంటున్నారు బిగ్ బాస్ లవర్స్. సోషల్ మీడియాలో ఈవారం ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరగబోతోంది అంటూ టాక్ వినిపిస్తోంది. నిజానికి ఓటీటీ బిగ్ బాస్ రియాలిటీ షో అనేది స్టార్ట్ అయినప్పుడు ట్విస్ట్ లు ఉండబోతున్నాయని హౌస్ మేట్స్, ఆడియన్స్ అంచనాలు వేశారు. కానీ, సాదాసీదాగా టెలివిజన్ లో జరిగినట్లుగానే షో జరిగిపోతోంది. ముమైత్ ఖాన్ రీఎంట్రీ, బాబాభాస్కర్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ, డబుల్ ఎలిమినేషన్ తప్ప, హౌస్ లో ఎలాంటి ట్విస్ట్ లు లేవు. కనీసం ఈసారి సీక్రెట్ రూమ్ ఎలిమినేషన్ కానీ, ఫేక్ ఎలిమినేషన్ కానీ జరగలేదు. అయితే, ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ అనేది పెట్టబోతున్నారని టాక్. అయితే, ఇది టాస్క్ రూపంలో ఉండబోతోందట. ముందుగానే బిగ్ బాస్ ఒక టాస్క్ ని ఇచ్చి, ఈ టాస్క్ లో ఎలిమినేట్ అయినవాళ్లు హౌస్ నుంచీ వెళ్లిపోబోతున్నారని చెప్తారని ట్విస్ట్ అదిరిపోయేలా టాస్క్ ఉంటుందని అంటున్నారు. అంతేకాదు, ఈటాస్క్ ని నిర్వహించడానికి లాస్ట్ సీజన్ లో ఉన్న టాప్ – 5 మెంబర్స్ హౌస్ లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
షణ్ముక్ జస్వంత్, సిరి ఆల్రెడీ స్టేజ్ పైన ఇప్పటికే ఓటీటీ పార్టిసిపెంట్స్ ని సపోర్ట్ చేసేందుకు వచ్చారు. వీళ్లిద్దరితో పాటుగా, శ్రీరామ్ చంద్ర, సన్నీ, మానస్ ఈ ముగ్గురూ కూడా హౌస్ లోకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు, టాప్ – 5 నిర్ణయించాలి అంటే ఇప్పుడున్న 9మందిలో కనీసం వారానికి ఇద్దరిని ఎలిమినేట్ చేయాలి. అందుకే, ఇప్పుడు ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఖచ్చితంగా ఉండబోతోందని బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈవారం మిడ్ వీక్ ఒకరిని, వచ్చే వారం మిడ్ వీక్ ఇంకొకరిని ఎలిమినేట్ చేయబోతున్నారట. అలా చేస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నవాళ్లు ఎవరైనా కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.
టాస్క్ లో బిందుమాధవి ఓడిపోయినా, అరియానా ఓడిపోయినా హౌస్ నుంచీ వెళ్లిపోవడం అనేది ఎంతవరకూ కరెక్ట్ అనేది ఇక్కడ పాయింట్. అయితే, వచ్చే మాజీ హౌస్ మేట్స్ మాత్రం బయట ఓటింగ్ ని దృష్టిలో పెట్టుకుని బిగ్ బాస్ చెప్పిన పార్టిసిపెంట్స్ నే ఎలిమినేట్ చేస్తారని ఇంకో టాక్ కూడా వినిపిస్తోంది. ఏది ఏమైనా ఇప్పుడు రానున్న రెండు వారాలు ఓటీటీ బిగ్ బాస్ లో ట్విస్ట్ లు చూడబోతున్నామన్నమాట.