మెగాస్టార్ 152 వ చిత్రంగా రూపొందిన ఆచార్య మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మాట్ని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి లు నిర్మించగా రాంచరణ్ సహా నిర్మాతగా వ్యవహరించాడు. ఏప్రిల్ 29న అంటే మరికొన్ని గంటల్లో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా ఈ మూవీకి పాజిటివ్ లు ఎన్ని ఉన్నాయో నెగిటివ్ లు కూడా సమానంగా ఉన్నాయి అనే చెప్పాలి. ఆచార్య ఫ్యాన్స్ ను భయపెడుతున్న నెగిటివ్ సెంటిమెంట్ లు కూడా అవే. అవేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) రాంచరణ్ : ఈ మూవీలో చరణ్ కూడా ఓ హీరోగా నటించాడు. రాజమౌళి దర్శకత్వంలో ఓ హీరో సినిమా చేశాక.. తర్వాత అతని నుండీ వచ్చే తదుపరి సినిమా డిజాస్టర్ అవ్వడం ఆనవాయితీగా వస్తుంది.
2) పూజా హెగ్డే : రాధే శ్యామ్, బీస్ట్ వంటి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ లు ఈమె అకౌంట్లో పడ్డాయి. మరి ఆచార్య ఏమవుతుందో అనేది ఒక సెంటిమెంట్.
3) చిరు సరసన హీరోయిన్ లేకపోవడం పెద్ద మైనస్. కొరటాల చెప్పినప్పటి నుండీ అది జనాలకి భారంగా తయారయ్యింది.
4) సోనూసూద్ ను ఇప్పుడు అంతా రియల్ హీరోగా ట్రీట్ చేస్తున్నారు. ఈ సినిమాలో అతను విలన్ గా నటించాడు. మరి అతని రోల్ ఈ మూవీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది ఒక పాయింట్.
5) నక్సలిజం బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలను జనాలు రిపీటెడ్ గా చూస్తారు అన్న గ్యారెంటీ లేదు.
6) ఆచార్య కి రూ.130 కోట్ల పైనే బిజినెస్ అయ్యింది. అంత మొత్తం రికవర్ చేయడం ఈజీ కాదు.
7) కె.జి.ఎఫ్ మరియు ఆర్.ఆర్.ఆర్ సినిమాలు ఇంకా డీసెంట్ రన్ ను కొనసాగిస్తున్నాయి. దాంతో ఆచార్య కి ఆ సినిమాలకి దక్కినన్ని ధియేటర్లు దొరకలేదు.
8) కొరటాల శివ సినిమాల్లో వీక్ క్లైమాక్స్ ఉంటుంది. ఈ సినిమాలో కూడా ఉంటే అది ఎంత వరకు ఎఫెక్ట్ చూపిస్తుందో..!
9) ఈ సినిమాలో కామెడీ కూడా లేదని వినికిడి. చిరు మాస్ సినిమా చేస్తే అందులో కామెడీ కూడా ఉండేలా చూసుకుంటారు. కామెడీ లో ఆయన మార్క్ చూపిస్తూ ఉంటారు. అది మిస్ అయితే ఎలా ఉంటుందో మరి..!
10) ఆచార్య టికెట్ రేట్లు విపరీతంగా పెంచేశారు. మరో పక్క పరీక్షల సీజన్. ఇలాంటి టైంలో మూవీకి ఓపెనింగ్స్ వస్తాయా.. రిపీట్ ఆడియన్స్ వస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఈ నెగిటివ్ సెంటిమెంట్ లను అధిగమించాలి అంటే.. హిట్ టాక్ ను రాబట్టుకోవాలి. అప్పుడే వీకెండ్ ను మరియు రంజాన్ హాలిడే ని ఉపయోగించుకుని క్యాష్ చేసుకునే అవకాశం ఉంటుంది
Most Recommended Video