Mirai: ‘మిరాయ్’ వంటి బ్లాక్ బస్టర్ ను మిస్ చేసుకున్న హీరో ఎవరో తెలుసా?

తేజ సజ్జ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన హిస్టారికల్ అండ్ మైథలాజికల్ డ్రామా ‘మిరాయ్’. ఇటీవల అంటే సెప్టెంబర్ 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తుంది. మరీ ‘హనుమాన్’ రేంజ్లో కాకపోయినా.. నార్మల్ సీజన్లో, అదీ మిడ్ రేంజ్ బడ్జెట్లో తీసిన ఈ సినిమాకి ఓపెనింగ్స్ చాలా బాగా వస్తున్నాయి అనే చెప్పాలి.

Mirai

‘మిరాయ్’ హైలెట్స్ గురించి చెప్పాలి అంటే.. ఇందులో ఉన్న వి.ఎఫ్.ఎక్స్ అనే చెప్పాలి. ముఖ్యంగా సంపాతి ఫైట్లోని వి.ఎఫ్.ఎక్స్ ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మంచు మనోజ్ పాత్రకి డిజైన్ చేసిన యాక్షన్ సీన్స్, వాటికి హరి గౌర అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వంటివి కూడా ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి అనే చెప్పాలి. అందుకే ‘మిరాయ్’ ని చూసేందుకు ఆడియన్స్ ఎగబడుతున్నారు. వీక్ డేస్ లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది.

ఇదిలా ఉండగా.. ‘మిరాయ్’ తో కచ్చితంగా ఈ హీరో తేజ సజ్జ రేంజ్ అయితే పెరుగుతుంది. మార్కెట్ పరంగా చూసుకున్నా, ఫ్యాన్ ఫాలోయింగ్ పరంగా చూసుకున్నా తేజ సజ్జ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం ఖాయం. అందులో ఎలాంటి సందేహం లేదు. ‘హనుమాన్’ సక్సెస్ లో తేజ సజ్జకి ఎక్కువ క్రెడిట్ దక్కలేదు. సంక్రాంతి సీజన్, అయోధ్య రామ మందిరం టైంలో రిలీజ్ అవ్వడం, అలాగే చిన్న సినిమాని తోక్కేస్తున్నారు.. వంటి ఫాక్టర్స్ వల్ల ఆ సినిమా క్రెడిట్ ఎవ్వరికీ ఎక్కువ దక్కలేదు.

అయితే ‘మిరాయ్’ సక్సెస్ క్రెడిట్ ఎక్కువ శాతం తేజ సజ్జకి చెందుతుంది. ఎందుకంటే ‘హనుమాన్’ తర్వాత వరుస సినిమాలు ఒప్పుకోకుండా అతను ఈ సినిమా కోసమే డెడికేటెడ్ గా పనిచేశాడు. పైగా కార్తీక్ ఘట్టమనేని ‘ఈగల్’ కూడా ప్లాప్ అవ్వడం వల్ల ‘మిరాయ్’ కి ‘హనుమాన్’ రేంజ్ హైప్ లేదు.

ఇదిలా ఉంటే.. వాస్తవానికి ‘మిరాయ్’ సినిమాకి ఫస్ట్ ఆప్షన్ తేజ సజ్జ కాదట. ఓ హీరో మిస్ చేసుకుంటే.. తేజ సజ్జ ఈ ప్రాజెక్టులోకి ఎంటర్ అయ్యాడట. ఆ హీరో మరెవరో కాదు సందీప్ కిషన్. అవును ‘మిరాయ్’ సినిమా కథ సందీప్ కిషన్ కి బాగా నచ్చిందట. కచ్చితంగా ఈ సినిమా చేయాలని అతను అనుకున్నాడట. కానీ మధ్యలో అతను కమిట్ అయిన సినిమాల షూటింగులు పెండింగ్లో ఉండటం వల్ల సందీప్ ‘మిరాయ్’ కథను వదులుకున్నాడట.

మరోపక్క తేజ సజ్జ ‘మజాకా’ సినిమాలో నటించాల్సి ఉందట. చిరంజీవి, తేజ సజ్జ కాంబినేషన్లో ‘మజాకా’ సినిమా చేయాలని దర్శకుడు త్రినాధ్ రావ్ నక్కిన అనుకున్నారట. కానీ తేజ సజ్జ, చిరంజీవి తప్పుకోవడం వల్ల సందీప్ కిషన్, రావు రమేష్ తో ఆ ప్రాజెక్టుని ఫినిష్ చేశాడు దర్శకుడు త్రినాధ్ రావ్. కానీ ఆ సినిమా ప్లాప్ అయ్యింది. సో ఇలా ‘మిరాయ్’ రూపంలో సందీప్ ఓ బ్లాక్ బస్టర్ మిస్ చేసుకున్నాడు. ‘మజాకా’ వంటి డిజాస్టర్ నుండి తేజ సజ్జ ఎస్కేప్ అయ్యాడు. అది మేటర్.

పర్వాలేదనిపిస్తున్న ‘కిష్కింధపురి’ కలెక్షన్స్.. కానీ

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus